ఈ మధ్య ఏ సోషల్ మీడియా ప్లాట్ఫారం లో చూసినా... చైనా పై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. పొరుగు దేశంపై ఎప్పటి నుంచో మనకు కొంత వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే అయినా... కరోనా వైరస్ ఆ దేశం నుంచి మొదలైనప్పటి నుంచి ఇది బాగా పెరిగిపోయింది. అసలు ఆ వైరస్ వ్యాప్తికి చైనాయే ప్రధాన కారణమని సాక్షాత్తూ అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే ప్రకటించారు. దాదాపు ఇదే అభిప్రాయం మన దేశంలోని కోట్ల మందికి కూడా ఉండటం విదితమే. అయితే ఇటీవల చాలా మంది సోషల్ మీడియా వేదికగా చేసుకొని చైనా ఉత్పత్తులను బహిష్కరించాలి.. కేవలం ఇండియన్ ప్రొడక్ట్స్ ను మాత్రమే వాడాలి అని కోరుతుండటం చూస్తున్నాం. ఇటీవల చైనా ఆర్మీ మన లడఖ్ ప్రాంతంలో మన సైనికులతో కుస్తీ పట్టడం, పొరుగున ఉన్న హిమాలయ దేశం నేపాల్ తో పరోక్షంగా ఇండియా కు వ్యతిరేక వ్యాఖ్యలు చేపించటం చూశాం. దీంతో ఇండియన్స్ భగ్గుమంటున్నారు. ఒక వైపు స్నేహం చేస్తున్నట్లు నటిస్తూనే మన పొరుగు దేశాలతో వెన్నుపోట్లు పొడవటం చైనాకు కొత్తదేం కాదు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఆ విషయం ఇప్పుడు ప్రతి పౌరుడికీ అర్థం అవుతోంది. అందుకే దేశవ్యాప్తంగా చైనా ప్రొడక్టుల వాడకం పై వ్యతిరేకత పెరుగుతోంది.

అది మాత్రమే చాలా...
అయితే చైనా పై మనకు కోపం, వ్యతిరేకత ఉండవచ్చు. ఆ దేశంలో ఉత్పత్తి అయ్యే ప్రొడక్టులను వాడకూడదు అని నిర్ణయం తీసుకోవచ్చు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ నిజంగా మనం అలా వాడకుండా ఉండగలమా అన్నదే అతి పెద్ద ప్రశ్నగా మిగిలిపోతోంది. ఎందుకంటే చైనా తన ఉత్పత్తులతో ఎంతలా మనల్ని ప్రభావితం చేసిందో ఒక్కసారి అవలోకనం చేసుకుంటే తెలుస్తుంది. చైనా మన నట్టింట్లోకి... నెట్టింట్లోకి దూరిపోయింది. అనుకున్నంత త్వరగా వదిలించుకోలేనంత అధికంగా మనల్ని ప్రభావితం చేసింది. మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్న స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు మెజారిటీ చైనా కు చెందినవే. అంతే కాదు ఒక పూట అన్నం తినకపోయినా సరే కానీ టిక్ టాక్ చేయకుండా ఉండలేని పరిస్థికి మన ప్రజలు చేరుకున్నారు. అది కూడా చైనా దే. ఇక అందరం కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితం ఐపోగా.. ఆన్లైన్ మీటింగ్స్ కోసం వాడుతున్న జూమ్ ఆప్ కూడా చైనా దేశపు ఉత్పత్తే కావటం విచారకరం.

మూడో వంతు మార్కెట్ ...
మన దేశంలో 135 కోట్ల జనాభా ఉంటే ... అందులో 100 కోట్ల మందికి పైగా మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. సుమారు 50 కోట్ల మంది ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఇందులో మూడో వంతు స్మార్ట్ ఫోన్లు చైనా దేశానికి చెందిన కంపెనీలు ఉత్పత్తి చేసేవే. షామీ, రియల్ మీ, వివో, ఒప్పో, వన్ ప్లస్ వంటి కంపెనీలు అన్నీ కూడా చైనా కు చెందినవే. రెడ్ మీ ఐతే టీవీలు కూడా తయారు చేసి మనకు అంటగడుతోంది. రూ 15,000 లోపు ధర పలికే దాదాపు అన్ని రకాల స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు చైనా కంపెనీలు తయారు చేస్తున్నవే. అవి ఎక్కడ తయారు అవుతున్నాయనేది అప్రస్తుతం. వాటికి మనం చెల్లించే డబ్బులు ఈ దేశానికి వెళుతున్నాయన్నదే ఇప్పుడు ముఖ్యం.

అక్కడ కూడా చైనా నే...
మన దేశంలో డిజిటల్ చెల్లింపులు, ఈ కామర్స్ రంగాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే ఇక్కడ కూడా చైనా పాగా వేసేసేంది. సుమారు 50 కోట్ల మంది మనదీ అనుకుని వాడుతున్న పేటీఎం ఆప్ లో ప్రధాన వాటాదారు కూడా చైనా కంపెనీయే. అలాగే మనం గ్రోసరీస్ ఆన్లైన్ లో ఆర్డర్ చేసే బిగ్ బాస్కెట్ కూడా చైనా కంపెనీ చేతిలో పావుగా మారిపోయింది. మన దేశం నుంచి చైనా కు జరిగే ఎగుమతులు మూరెడు ఉంటే .. ఆ దేశం నుంచి మనకు దిగుమతి అవుతున్న వస్తువుల లిస్టు బారెడు ఉంటుంది. చిన్న పిల్లలు ఆడుకునే ఆట బొమ్మల దగ్గర నుంచి పెద్ద వాళ్ళు వినియోగించే అత్యవసర వస్తువుల వరకు అన్నిటికి మనం చైనా పైనే ఆధారపడుతున్నాం. కాబట్టి, ఒక్క రోజులోనో, ఒక్క ఏడాదిలోనో ఆ దేశ ఉత్పత్తుల వినియోగం నిలిపివెయ్యలేం. ఇందుకోసం ప్రభుత్వం తగిన ప్రణాళికలు రచించి దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేస్తేనే డ్రాగన్ కు చెక్ పెట్టగలం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications