For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్ జోన్ పరిధిలో రైల్వే-ఎస్బీఐ మధ్య డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ఒప్పందం

|

ఇండియన్ రైల్వేలోని సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) జోన్ (హైదరాబాద్ జోన్) ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంకా అఫ్ ఇండియా (SBI)తో ఎంవోయూ కుదుర్చుకుంది. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ కోసం ఈ ఒప్పందం జరిగింది. ఈ జోన్ పరిధిలోని 585 రైల్వే స్టేషన్ల పరిధిలో సమకూరే రాబడి తాలూకు సొమ్మును నేరుగా సేకరించి తీసుకు వెళ్లేలా వీటి మధ్య ఒప్పందం కుదిరింది.

వేరే ఉద్యోగం చూసుకోండి, ఓయోలో 2,400 మంది ఉద్యోగుల తొలగింత!వేరే ఉద్యోగం చూసుకోండి, ఓయోలో 2,400 మంది ఉద్యోగుల తొలగింత!

ఇప్పటి వరకు ఇలా..

ఇప్పటి వరకు ఇలా..

సోమవారం ఎస్బీఐ, రైల్వే అధికారులు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య సమక్షంలో సంతకాలు చేశారు. ప్రస్తుతం చిన్న రైల్వే స్టేషన్లలో టిక్కెట్ల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని సెలెక్టెడ్ రైళ్ళ పెట్టోల్లో భద్రపరిచి మరోచోటుకు తరలిస్తున్నారు. పెద్ద పెద్ద స్టేషన్లలోను సొమ్మును ఆర్పీఐ భద్రత మధ్య ఆయా రైల్వే స్టేషన్ సూపర్ వైజర్లు దగ్గరలోని ఎస్బీఐలో జమ చేస్తున్నారు.

డోర్‌స్టెప్ బ్యాంకింగ్

డోర్‌స్టెప్ బ్యాంకింగ్

తాజా ఒప్పందంతో బ్యాంకు సిబ్బంది రైల్వే స్టేషన్లకే వచ్చి సొమ్మును తీసుకు వెళ్తారు. వారే రైల్వే శాఖ ఖాతాలో జమ చేస్తారు. ఈ ఒప్పందం ద్వారా రైల్వేకు శ్రమ తప్పుతుంది. కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ డోర్ స్టెప్ బ్యాంకింగ్ ప్రకారం అంతకుముందు ఎదుర్కొన్న ఇబ్బందులు ఉండవు. పైగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వేగాన్ని పెంచుతుంది. రైల్వేల నగదు ఆదాయ చెల్లింపు మరింత డిజిటలైజ్ అవుతుంది.

డోర్‌స్టెప్ బ్యాంకింగ్ బెనిఫిట్స్..

డోర్‌స్టెప్ బ్యాంకింగ్ బెనిఫిట్స్..

- అన్ని రైల్వే స్టేషన్లలో ఏకరీతి నగదు చెల్లింపు విధానం ఉంటంది.

- రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ద్వారా వివిధ స్టేషన్ల ద్వారా జమ చేసిన క్యాష్ తెలుసుకోవచ్చు. మంచి పర్యవేక్షణ, జవాబుదారితనానికి ఉపయోగపడుతుంది.

- రైల్వే స్టేషన్లలో అవాంఛితంగా నగదు పోగుపడకుండా ఉంటుంది.

- స్టేషన్ ఆదాయ చెల్లింపులకు ఇది సులభ మార్గం అవుతుంది.

English summary

హైదరాబాద్ జోన్ పరిధిలో రైల్వే-ఎస్బీఐ మధ్య డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ఒప్పందం | Indian Railways, SBI come together to offer doorstep banking in 585 stations

Indian Railways’ South Central Railway(SCR) zone has signed a Memorandum of Understanding (MoU) with State Bank of India(SBI) for ‘doorstep banking’.
Story first published: Wednesday, January 15, 2020, 9:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X