For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Railway Jobs: ఆర్‌పీఎఫ్ ఉద్యోగాల నోటిఫికేషన్.. 9000 పోస్టుల భర్తీపై రైల్వే స్పందన..

|

Railway Jobs Fact: రైల్వేలకు సంబంధించిన ఆర్‌పీఎఫ్ విభాగంలో తాజా రిక్రూట్ మెంట్లు జరుగుతున్నట్లు వార్తలు మీడియాలో వస్తున్నాయి. దీనికోసం అనేక మంది ఔత్సాహిక అభ్యర్థుల్లో ఆనందం నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకోండి.

రైల్వే ప్రకటన ఇలా..

రైల్వే ప్రకటన ఇలా..

ఆర్‌పీఎఫ్ రిక్రూట్‌మెంట్- 2022 అతిపెద్ద రిక్రూట్ మెట్ ప్రకటన చేసిందని.. దీని ప్రకారం దాదాపు 9000 కొత్త ఉద్యోగాలు రానున్నాయనే వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ప్రచారంలో ఉన్న ఈ వార్తను రైల్వే శాఖ ఖండించింది. తాము ఎలాంటి ప్రకటన చేయలేదని, నోటిఫికేషన్‌ను విడుదల చేయలేదని స్పష్టం చేసింది. ఆర్‌పీఎఫ్ లేదా రైల్వేలు తమ అధికారిక వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ ను జారీ చేయలేదు.

రిక్రూట్‌మెంట్ గురించి..

రిక్రూట్‌మెంట్ గురించి..

రైల్వే ఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుళ్లను రిక్రూట్‌మెంట్ చేస్తున్నట్లు మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. అభ్యర్థుల కోసం RRB నోటిఫికేషన్ విడుదల చేసిందని వాటి సారాంశం. నివేదికల్లోనే రైల్వేశాఖ నోటిఫికేషన్ జారీ చేసిందని పేర్కొనబడింది. అయితే ప్రచారంలో ఉన్న నివేదికల్లో దరఖాస్తు తేదీ, చివరి తేదీ, పరీక్ష తేదీలకు సంబంధించిన సమాచారం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో, వార్తా కథనాల్లో ప్రచారంలో ఉన్న ఈ నోటిఫికేషన్‌ను రైల్వే శాఖ తిరస్కరించింది.

 రైల్వేలో 72 వేల ఉద్యోగాలను తొలగించిందా?

రైల్వేలో 72 వేల ఉద్యోగాలను తొలగించిందా?

తాజాగా.. రైల్వే శాఖ 72 వేల ఉద్యోగాలను తొలగించినట్లు కూడా కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ మేరకు రాజ్యసభలో ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. దీనిపై కొద్ది రోజుల క్రితం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. వాస్తవానికి.. జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు రాజ్యసభలో ప్రభుత్వానికి ఈ ప్రశ్న అడిగారు. గత 6 ఏళ్లలో భారతీయ రైల్వే 72,000 పోస్టులను రద్దు చేసిందా? దీనిపై అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ.. 'అలా కాదు. పోస్టుల హేతుబద్ధీకరణ క్రమానుగతంగా హ్యామన్ రిసోర్సెస్ అవసరం ఆధారంగా జరుగుతుందని అన్నారు. మారుతున్న పని భారం పరిస్థితి, కొత్త టెక్నాలజీల విలీనం, కొత్త పద్దతులు, కొత్త ఆస్తుల సృష్టి మొదలైనవాటి ఆధారంగా ప్రణాళికలు ఉంటాయని తెలిపారు.

ఉద్యోగుల ఔట్ సోర్సింగ్ పై రైల్వే దృష్టి..!

ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌ మినహా మిగిలిన పనులన్నీ ఔట్‌సోర్సింగ్‌ రూపంలో రైల్వేలు నిర్వహించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే శానిటరీ, బెడ్‌రోల్, క్యాటరింగ్ వంటివి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. రానున్న కాలంలో టిక్కెట్ల పని కూడా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీ మెట్రోలో ఇప్పటికే ఈ ఏర్పాటు జరిగింది. నివేదికల ప్రకారం.. రాజధాని, శతాబ్ది, మెయిల్-ఎక్స్‌ప్రెస్ రైళ్ల జనరేటర్లలో ఎలక్ట్రికల్-మెకానికల్ టెక్నీషియన్లు, కోచ్ అసిస్టెంట్లు, ఆన్‌బోర్డ్ స్వీపర్లు మొదలైన పనులను కాంట్రాక్ట్‌పై ఇచ్చినట్లు తెలుస్తోంది.

English summary

Railway Jobs: ఆర్‌పీఎఫ్ ఉద్యోగాల నోటిఫికేషన్.. 9000 పోస్టుల భర్తీపై రైల్వే స్పందన.. | indian railways clarifies over 9000 rpf job openings notification and pib india fact check

indian railways clarifies over 9000 rpf job openings know details
Story first published: Friday, August 12, 2022, 16:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X