For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైల్వే పిర్యాదులు, సమాచారానికి ఒకే హెల్ప్‌లైన్ నెంబర్ 139: ఎలా పని చేస్తుందంటే?

|

ఢిల్లీ: రైల్వే ప్రయాణీకులు ఒక్కో రకమైన సమస్యకు ఒక్కో ఫోన్ నెంబరుకు డయల్ చేయాల్సిన అవసరం లేకుండా రైల్వే శాఖ సులభతరం చేసింది. ప్రయాణీకులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా సింగిల్ నెంబర్ '139'ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. గతంలో ప్రయాణీకులు తమ సమస్యలపై వేర్వేలు అంశాలపై వేర్వేరు హెల్ప్ లైన్ నెంబర్ల ద్వారా సంప్రదించవలసి వచ్చేది. దీంతో వివిధ నెంబర్లతో ప్రయాణీకులు ఇబ్బందులు పడేవారు. రైల్వే శాఖ ఇప్పుడు దానిని సులభతరం చేస్తూ ప్రయాణీకుల ఇబ్బందులు తొలగించింది.

139కు ఫోన్ చేస్తే చాలు

139కు ఫోన్ చేస్తే చాలు

ఇక నుంచి ఏ ఫిర్యాదుకు అయినా లేదా ఏ సమాచారానికి అయినా వెంటనే సహాయం కోసం139 నెంబర్‌కు ఫోన్ చేస్తే సరిపోతుంది. ఈ ఒక్క నెంబర్‌ను గుర్తు పెట్టుకుంటే చాలని రైల్వే శాఖ తెలిపింది.

12 భాషల్లో 139

12 భాషల్లో 139

139 నెంబర్‌కు కాల్ చేస్తే సమాధానాలు కూడా వివిధ భాషల్లో అందుబాటులో ఉంటాయి. మొత్తం 12 భాషల్లో ప్రయాణీకుల ఫిర్యాదుపై స్పందించే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. అన్ని రకాల ఫోన్ల ద్వారా కూడా ఈ సేవలు పొందవచ్చు.

182 కొనసాగుతుంది..

182 కొనసాగుతుంది..

అయితే రైల్వే భద్రత సేవల మాత్రం 182 హెల్ప్ లైన్ నెంబర్ కొనసాగుతుందని రైల్వే శాఖ తెలిపింది. ఇదివరకు మహిళా భద్రత కోసం 182 (కొనసాగుతుంది), జనరల్ కంప్లయింట్స్ కోసం 138, పిల్లల మిస్సింగ్ కోసం 1098, రైల్వే ఎంక్వయిరీ కోసం 1800111139, రైల్వే పోలీస్ కోసం 1800111322 ఉండేవి. ఇప్పుడు వీటన్నింటికి బదులు 139 సింగిల్ నెంబర్‌కు ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చారు.

139 ఎలా పని చేస్తుంది? భద్రతకు 1 నెంబర్, టిక్కెట్ కోసం 2 నెంబర్

139 ఎలా పని చేస్తుంది? భద్రతకు 1 నెంబర్, టిక్కెట్ కోసం 2 నెంబర్

- 139 నెంబర్‌కు ఫోన్ చేసిన తర్వాత ఒక్కో రకమైన సేవ లేదా ఫిర్యాదు కోసం ఒక్కో నెంబరును ప్రెస్ చేయాల్సి ఉంటుంది.

- కాల్ చేశాక 1 నెంబర్‌ను భద్రత, వైద్య సేవల కోసం ప్రెస్ చేయాలి.

- PNR స్టేటస్, రైలు రాకపోకలు, అకామిడేషన్, టిక్కెట్ ధర, టిక్కెట్ రద్దు సమాచారం, వీల్ చైర్ బుకింగ్, వేకప్ అలార్మ్ పెసిలిడీ, డెస్టినేషన్ అలర్ట్, భోజనం బుకింగ్ కోసం నెంబర్ 2 ప్రెస్ చేయాలి.

3, 4, 5, 6 నెంబర్ ఎందుకోసమంటే?

3, 4, 5, 6 నెంబర్ ఎందుకోసమంటే?

- క్యాటరింగ్ ఫిర్యాదుల కోసం నెంబర్ 3ను ప్రెస్ చేయాలి.

- సాధారణ ఫిర్యాదుల కోసం నెంబర్ 4ను ప్రెస్ చేయాలి.

- నిఘా సంబంధిత ఫిర్యాదుల కోసం నెంబర్ 5ను ప్రెస్ చేయాలి.

- ప్రమాదాల సమయంలో వివరాల కోసం నెంబర్ 6ను ప్రెస్ చేయాలి.

- ఫిర్యాదులపై చర్యలపై సమాచారం కోసం 9ని ప్రెస్ చేయాలి.

- కస్టమర్ కేర్‌తో మాట్లాడేందుకు స్టార్ ప్రెస్ చేయాలి.

English summary

రైల్వే పిర్యాదులు, సమాచారానికి ఒకే హెల్ప్‌లైన్ నెంబర్ 139: ఎలా పని చేస్తుందంటే? | Indian Railway launches integrated helpline number 139

The Indian Railways has integrated all helpline numbers with its 139 service as one-stop solution to all queries and problems from January 1, 2020.
Story first published: Friday, January 3, 2020, 8:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X