For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోమ్ లోన్, వెహికిల్ లోన్ తీసుకునే వారికి ఈ బ్యాంకు గుడ్‌న్యూస్!

|

గతంలో మందగమనం, ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వరుసగా రెపో రేటు, రివర్స్ రెపో రేటు తగ్గిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెపో రేటు తగ్గింపు ప్రయోజనాలను బ్యాంకులు తమ కస్టమర్లకు కూడా బదలీ చేయాలని ప్రభుత్వం, ఆర్బీఐ సూచించింది. ఈ నేపథ్యంలో వివిధ బ్యాంకులు వడ్డీ రేటు తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు బదలీ చేస్తున్నాయి. అలాగే, డిపాజిట్లపై కూడా కస్టమర్లకు వడ్డీని తగ్గిస్తున్నాయి. తాజాగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించింది.

ఆ కంపెనీలకు అమెరికా షాక్, చైనాకు ట్రంప్ 'కఠిన' హెచ్చరికఆ కంపెనీలకు అమెరికా షాక్, చైనాకు ట్రంప్ 'కఠిన' హెచ్చరిక

ఎంత తగ్గించిందంటే

ఎంత తగ్గించిందంటే

ప్రభుత్వరంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (IOB) నిధుల వ్యయ ఆధారిత రుణ రేటు(MCLR)ను వివిధ టైమ్ పీరియడ్స్ పైన 30 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. జూన్ 10వ తేదీ నుండి ఈ కొత్త రేట్లు అమలులోకి వస్తాయి. ఈ మేరకు బ్యాంకు ప్రకటించింది. నెల, ఏడాది, ఎంసీఎల్ఆర్‌ను 20 బేసిస్ పాయింట్లు, ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్‌ను 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

లోన్ తీసుకుంటే వడ్డీ తగ్గుదల

లోన్ తీసుకుంటే వడ్డీ తగ్గుదల

రెపో అనుసంధఆనిత రుణ రేటు(RLLR)ను ఏడాదికి 7.25 శాతం నుండి 6.85 శాతానికి తగ్గిస్తున్నట్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు తెలిపింది. అంటే రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రిటైల్ రుణాలు, ఎంఎస్ఎంఈలకు అందించే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. హోమ్ లోన్స్, స్టడీ లోన్, వెహికిల్ లోన్ వంటివి తీసుకునే వారికి ఇది ప్రయోజనకరం.లోన్ తీసుకుంటే వడ్డీ తగ్గుదల

రెపో అనుసంధఆనిత రుణ రేటు(RLLR)ను ఏడాదికి 7.25 శాతం నుండి 6.85 శాతానికి తగ్గిస్తున్నట్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు తెలిపింది. అంటే రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రిటైల్ రుణాలు, ఎంఎస్ఎంఈలకు అందించే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. హోమ్ లోన్స్, స్టడీ లోన్, వెహికిల్ లోన్ వంటివి తీసుకునే వారికి ఇది ప్రయోజనకరం.

ఆర్బీఐ తగ్గింపుతో....

ఆర్బీఐ తగ్గింపుతో....

ఆర్బీఐ ఇటీవల రెపో రేటు 40 బేసిస్ పాయింట్స్ తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో చాలా బ్యాంకులు ఆ రేట్ల కోత ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలి చేస్తున్నాయి. ఇప్పటికే ఎస్బీఐ, కెనరా తదితర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. ఇప్పుడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించింది.

English summary

హోమ్ లోన్, వెహికిల్ లోన్ తీసుకునే వారికి ఈ బ్యాంకు గుడ్‌న్యూస్! | Indian Overseas Bank cuts lending rate by up to 30 basis points

The sector lender Indian Overseas Bank (IOB) has cut marginal cost of funds based lending rate (MCLR) by up to 0.30 per cent across all tenors, which will bring down cost for consumer loans.
Story first published: Monday, June 8, 2020, 11:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X