For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Indian Economy: నెమ్మదించిన భారత వృద్ధి వరమా..? శాపమా..? పూర్తి వివరాలు

|

Indian Economy: ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ల మాదిరిగానే భారత వృద్ధి సైతం నెమ్మదిస్తోంది. అనేక అంతర్జాతీయ సంస్థలు సైతం దీనికి అనుగుణంగానే తమ వృద్ధి అంచనాలను మారుస్తున్నాయి. గతంలో ఇచ్చిన టార్గెట్లను తగ్గిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితి మన దేశానికి వరమా లేక శాపమా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

రేటింగ్ సంస్థలు..

రేటింగ్ సంస్థలు..

గోల్డ్‌మన్ సాక్స్, బార్‌క్లేస్ పీఎల్‌సీతో సహా ఆర్థికవేత్తల ప్రకారం భారత ఆర్థిక వృద్ధి గత కొన్ని సంవత్సరాలుగా 6 శాతం వరకు మందగించవచ్చని అంచనా వేశాయి. అయితే ఇది భారత ఆర్థిక వ్యవస్థకు చెడ్డది కాదని వారు అంటున్నారు. 2024 నాటికి ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి చల్లబరుస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే జీడీపీ వృద్ధి మందగిమంచటం భారతదేశానికి మంచిదేనని గోల్డ్‌మన్ సాచ్స్‌కు చెందిన సంతను సేన్‌గుప్తా అన్నారు.

పెరిగిన వడ్డీ రేట్లు..

పెరిగిన వడ్డీ రేట్లు..

మెుండిగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసేందుకు రంగంలోకి దిగిన భారతీయ రిజర్వు బ్యాంక్ మే నెల నుంచి ఇప్పటి వరకు రెపో రేటును 190 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. అయితే ఈ పెంపు కొనసాగుతుందని తెలుస్తోంది. వడ్డీ రేట్ల పెంపు వేగం తగ్గించాలని ఇప్పటికే వ్యాపార వర్గాలు ప్రభుత్వాన్ని కోరాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ 6.2% ఉండగా.. ఏప్రిల్-జూన్‌లో 13.51% గా ఉంది.

కరెంట్ ఖాతా లోటు..

కరెంట్ ఖాతా లోటు..

భారతదేశం నెమ్మదిగా వృద్ధి చెందడం ప్రపంచ మందగమనంతో సమానంగా ఉండవచ్చని యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ చీఫ్ ఎకనామిస్ట్ సౌకత భట్టాచార్య అన్నారు. తక్కువ వృద్ధి కరెంట్ ఖాతా లోటును మెరుగ్గా నియంత్రించటంలో సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు. రానున్న 5 ఏళ్లలో భారతదేశ వృద్ధి సామర్థ్యం 6.2 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఈ ఏడాది ప్రారంభంలో దీనిని 7 శాతంగా IMF అంచనా వేసింది.

ప్రపంచ దేశాలతో పోల్చితే..

ప్రపంచ దేశాలతో పోల్చితే..

ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం యొక్క విస్తృతమైన వృద్ధి వ్యత్యాసాలు డబుల్ ఎడ్జ్‌గా ఉండటం ముఖ్యమైన సమస్య అని బార్క్లేస్ బజోరియా అన్నారు. ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థల కంటే భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉందని ఆర్థిక పరిశోధనా సంస్థ అర్థ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిరంజన్ రాజాధ్యక్ష పేర్కొన్నారు. ప్రస్తుత ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు దృష్ట్యా దేశీయ డిమాండ్‌ను ప్రేరేపించడం ద్వారా అదనపు వృద్ధిని పెంచడం కంటే ప్రస్తుతానికి ఏకీకృతం చేయడం మంచిదని అన్నారు.

English summary

Indian Economy: నెమ్మదించిన భారత వృద్ధి వరమా..? శాపమా..? పూర్తి వివరాలు | indian economys slow growth considered as good, know hat economists says

Indian economys slow growth considered as good, know hat economists says
Story first published: Tuesday, November 29, 2022, 17:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X