For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా పెరిగిన భారత్ స్టీల్ ఎగుమతులు, చైనా-వియత్నాంకే ఎక్కువ

|

భారత స్టీల్ ఉత్పత్తులు 153 శాతం పెరిగినట్లు కేంద్ర ఉక్కు మంత్రితవ శాఖ తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఆగస్ట్‌తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఎగుమతులు భారీగా పెరిగినట్లు తెలిపింది. దేశీయ ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం 2014-15లో 109.85 మిలియన్ టన్నులు కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికి 142.29 మిలియన్ టన్నులకు పెరిగింది.

ముడి ఉక్కు ఉత్పత్తి 2014-15లో 88.98 మిలియన్ టన్నులు కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరానికి 109.14 మిలియన్ టన్నులకు పెరిగినట్లు కేంద్రమంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని రెండు పబ్లిక్ సెక్టార్ స్టీల్ కంపెనీలు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ గత మూడేళ్లలో సాధించిన ఆర్థిక పనితూరు, ఎగుమతుల గణాంకాలను సోమవారం విడుదల చేసింది.

Ecom Express: విజయవాడ సహా మెట్రో నగరాల్లో 30,000 ఉద్యోగాలుEcom Express: విజయవాడ సహా మెట్రో నగరాల్లో 30,000 ఉద్యోగాలు

ఏప్రిల్-జూన్‌లోను పెరిగిన స్టీల్ ఎగుమతులు

ఏప్రిల్-జూన్‌లోను పెరిగిన స్టీల్ ఎగుమతులు

ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో స్టీల్ ఉత్పత్తులు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రెండింతల కంటే ఎక్కువగా పెరిగినట్లు ఇటీవలి డేటా వెల్లడించింది. ఇండియా నుండి ఎగుమతి అయిన స్టీల్‌లో 28 శాతం చైనా దిగుమతి చేసుకుంది. మరోవైపు, భారత్ దిగుమతి చేసుకున్న మొత్తం ఫినిష్డ్ స్టీల్‌లో 42 శాతం తగ్గుదల నమోదు చేసింది. అంటే చైనాపై ఆధారపడటాన్ని భారత్ 21 శాతం తగ్గించినట్లుగా చెబుతున్నారు.

రెండో అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారు

రెండో అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారు

ఈ సంవత్సరం ఏప్రిల్ - జూన్ మధ్య 4.64 మిలియన్ టన్నుల (MT) ఫినిష్డ్ స్టీల్ భారత్ నుండి ఎగుమతి చేయబడింది. చైనా, వియత్నాంకు స్టీల్ ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి. చైనాకు 1.3 మిలియన్ టన్నులు, వియత్నాంకు 1.37 మిలియన్ టన్నుల స్టీల్ ఎగుమతులు జరిగాయి. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తి 39.8 శాతం మేర తగ్గింది. అలాగే, 2019తో పోలిస్తే 2020లో స్టీల్ వినియోగం 43.3 శాతం మేర తగ్గింది. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ నివేదిక ప్రకారం గత కొన్నేళ్లుగా భారత్ రెండో అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిగా కొనసాగుతోంది.

కోలుకుంటున్న చైనా

కోలుకుంటున్న చైనా

కాగా, చైనాలో ఆగస్ట్ నెలలో రిటైల్ సేల్స్ పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ఈ రోజు ఉదయం చైనా సహా ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. వినియోగం పెరుగుతుండటంతో ఉత్పత్తి కూడా పెరుగుతోంది. చైనాలో క్రూడ్ స్టీల్ ఔట్‌పుట్ ఆగస్ట్ నెలలో 94.85 శాతంగా ఉంది. జూలైలో 3.012 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి ఉండగా, ఆగస్ట్ నాటికి 1.6 శాతం పెరిగి 3.06 శాతంగా నమోదయింది. జనవరి - ఆగస్ట్ కాలంలో ఉత్పత్తి 3.7 శాతం మేర పెరిగింది.

English summary

భారీగా పెరిగిన భారత్ స్టీల్ ఎగుమతులు, చైనా-వియత్నాంకే ఎక్కువ | India steel exports increased by 153 percent

India was a net exporter of steel in 2019-20 and during the period of April-August 2020, steel exports from India have increased by more than 153%.
Story first published: Tuesday, September 15, 2020, 16:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X