ప్రభుత్వాలు కొన్ని సమయాల్లో జీడీపీ రేటును ఎక్కువ పెంచి చూపిస్తాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. వాస్తవ డేటా లేనిపక్షంలో జీడీపీ అంచనాలు అక్యురేట్‌గా ఉండవు. ఇటీవల గత ఆర్థిక సంవత్సరానికి, గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌కు విడుదలైన జీడీపీ వృద్ధి రేటు ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. జాతీయ గణాంక కార్యాలయం వివరాల మేరకు గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం జనవరి-మార్చి మధ్య జీడీపీ వృద్ధి రేటు 3.1 శాతం, 2019-20 ఆర్థిక సంవత్సరానికి 4.2 శాతంగా నమోదయింది.

ఆశ్చర్యపరిచిన డేటా
మాజీ చీఫ్ స్టాటిస్టిషియన్ ప్రణబ్ సేన్ FY20 జనవరి-మార్చి క్వార్టర్‌లో జీడీపీని రూ.2 లక్షల కోట్ల వరకు ఓవర్ ఎస్టిమేట్ వేసినట్లుగా అభిప్రాయపడ్డారు. ఇది భారత వార్షిక జీడీపీలో 1 శాతానికి సమానం. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్(MoSPI) విడుదల చేసిన డేటా చాలామంది ఎకనమిస్ట్‌ను ఆశ్చర్యపరిచిందట. ఇంకొంతమంది అంచనా కంటే చాలా ఎక్కువగా ఉందని చెబుతున్నారు.

గతంలోను ఇలా..
ఉదాహరణకు స్టాన్‌చార్ట్ నాలుగో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటును మైనస్ 1.5 శాతంగా అంచనా వేసింది. మరికొంతమంది 1 శాతం నుండి 2 శాతం మధ్య అంచనా వేశారు. కానీ శుక్రవారం విడుదల చేసిన వృద్ధి రేటు నివేదిక మాత్రం 3.1 శాతంగా ఉంది. నాలుగో క్వార్టర్‌లో జీడీపీ వృద్ధి రేటుపై నోమురా రీసెర్చ్‌కు చెందిన సోనాల్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే జీడీపీని ఎక్కువగా అంచనా వేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలా వేసినట్లు వార్తలు వచ్చాయి.

విమర్శలకు తావిస్తున్న అకౌంటింగ్
జీడీపీ డేటా అస్థిరతపై సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్ఓ) స్పందించాలని కూడా కొంతమంది ఆర్థికవేత్తలు కోరుతున్నారు. సీఎస్ఓ అంచనాకు అంతుచిక్కని విధంగా నిర్మాణాత్మక ఆర్థికమార్పులు చోటు చేసుకుంటున్నాయా అంటున్నారు. ఇది కేవలం సీఎస్ఓ నుండి రావాల్సిన సమాధానం మాత్రమేనని అంటున్నారు. భారత నేషనల్ ఇన్‌కం అకౌంటింగ్ గత కొన్నేళ్లుగా విమర్శలకు తావిస్తోందని గుర్తు చేస్తున్నారు.

చైనా బాటలో...
ఇండియా అకౌంటింగ్ విశ్వసనీయత కూడా చైనా మార్గంలో ఉన్నట్లుగా కనిపిస్తోందనే వారు లేకపోలేదు. త్వరలో డేటా క్రెడిబులిటీని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అభివృద్ధి చెందాలనుకునే ఆర్థిక వ్యవస్థకు ఇది చాలా కీలకమని చెబుతున్నారు.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications