A Oneindia Venture

చైనా చాలా డేంజర్..ఎప్పటికైనా భారత్ వినాశనమే దానికి కావాలి..ప్రముఖ ఆర్థిక వేత్త సంచలన వ్యాఖ్యలు

భారత్-చైనా వ్యాపారంపై సమగ్ర పరిశీలన అవసరమని ప్రముఖ ఆర్థిక నిపుణులు మొంటేక్ అహ్లూవాలియా సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాతో వ్యాపారంలో బలమైన విధానం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. చైనా ఎగుమతులపై భారత్ ఆధార పడటం తగ్గించాలని భారత ప్రభుత్వానికి అహ్లూవాలియా సూచించారు. భారత వాణిజ్యంలో చైనా ప్రాధాన్యం పెరుగుతోందని ఇది చాలా ప్రమాదకర సంకేతాలకు దారి తీస్తుందని మాజీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు తెలిపారు.

చైనాతో వాణిజ్య సంబంధాలు చేసే సమయంలో భారత్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రణాళికా సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా హెచ్చరించారు. చైనాతో సంబంధాలలో ఆర్థిక అవకాశాలు, వ్యూహాత్మక ఆలోచనలను దృష్టిలో ఉంచుకుని భారత్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (API) సరఫరా కోసం డ్రాగన్ కంట్రీపై ఇండియా చాలా ఆధారపడిందని చెప్పుకొచ్చారు.

India China trade Montek Singh Ahluwalia India dependence on China China imports India India China economic relations India China policy Indian trade policy reduce China imports India China tensions economic sovereignty India Planning Commission Monte

దిగుమతులను పూర్తిగా తిరస్కరించడం గురించి సమస్య కాదని..అయితే ఇది దేశీయంగా విభిన్న వనరుల ద్వారా వ్యూహాత్మక ప్రమాదాలను కలిగిస్తుందని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా వాలియా చైనాతో వాణిజ్యంపై మూడు ప్రధాన ఆందోళనలను హైలెట్ చేశారు. అవేంటంటే.. వాణిజ్య విధానంలో దోపిడి, వ్యూహాత్మకంగా చైనాపై ఆధారపడటం, భద్రతాపరికరాల కొనుగోలు విషయంలో ఏర్పడే సైబర్ భద్రతా ప్రమాదాలు.. ఇవి మూడు చైనాతో చాలా ప్రమాదకరమని వాలియా హెచ్చరించారు.

చైనా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పిన మాజీ అర్థిక నిపుణుడు.. సాధారణ పరిస్థితుల్లో మనం దానిని ముఖ్యమైన వాణిజ్య భాగస్వామిగా పరిగణించాలని తెలిపారు. అయితే ఇదే సమయంలో చైనా గురించి మనకు భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నాయన్నది కూడా పచ్చి నిజమన్నారు. చైనా ఎగుమతులపై పారదర్శకత లేని సబ్సిడీపై తన మొదటి ఆందోళన కేంద్రీకృతమై ఉందని, ఇది భారతీయ పరిశ్రమలకు హాని కలిగించవచ్చని తెలిపారు. చైనాతో వాణిజ్యపరమైన సంబంధాలను ఎదుర్కోవడానికి సమర్ధవంతమైన సుంకాలను విధించే వ్యవస్థను కలిగి ఉండాలని తెలిపారు.

మనం ఫార్మా రంగంలో దూసుకుపోతున్నప్పటికీ APIల సరఫరా కోసం చైనా మీద ఆధారపడటం ప్రారంభించామని చెప్పుకొచ్చారు. చైనా దిగుమతులను తిరస్కరించడం విషయం కాదని అయితే ఇదే సమయంలో దేశీయంగా తయారయ్యే ఉత్పత్తులపై కీలక నిర్ణయం తీసుకోవాలన్నారు. దేశీయ అవసరాలకు తగిన విధంగా వనరులను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. మన దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత శక్తినిచ్చే అరుదైన భూములు, ఖనిజాల విషయంలో కూడా ఇలాంటి సమస్య తలెత్తుతుందని ఆర్థికవేత్త అన్నారు.

భారతదేశంలో దేశీయ నిల్వలు లేని ప్రాంతాలలో చైనా ఇప్పటికే తన ఎగుమతుల ద్వారా ఈ గుత్తాధిపత్యాన్ని ఆయుధంగా చేసుకుంది. అటువంటి సందర్భాలలో పరిష్కారం ఏంటంటే మన దేశంలో తయారైన వస్తువులకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని అప్పుడే చైనా ఆధిపత్యాన్ని తగ్గించగలమని వాలియా తెలిపారు. మూడవ ఆందోళన విషయానికి వస్తే.. సైబర్ బెదిరింపులను కలిగించే ఉత్పత్తులకు గిరాకి పెంచడం.. భారత రక్షణ రంగానికి సంబంధించిన కీలక వ్యవస్థలలో విశ్వసనీయత లేని ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల తీవ్రమైన నష్టాన్ని కలిగించే సైబర్ దాడి అవకాశం ఉందని అహ్లువాలియా అన్నారు. అటువంటి సందర్భాలలో.. మన దేశం లోకల్ సరఫరాలపై ఆధారపడటం లేదా 'విశ్వసనీయ వనరుల' నుండి మాత్రమే దిగుమతి చేసుకోవడం వంటి కొన్ని కలయికలను ఆశ్రయించాలని తెలిపారు.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+