For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తగ్గిన వృద్ధి రేటు అంచనా: భారత్ 80% కారణమన్న IMF గీతా గోపీనాథ్

|

దావోస్: అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) భారత వృద్ధి రేటు అంచనాను తగ్గించింది. 2020లో 4.8 శాతంగా ఉండనుందని సోమవారం పేర్కొంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సెక్టార్, బలహీన గ్రామీణ ఆదాయం పెరుగుదల వృద్ధిరేటు తగ్గించడానికి గల కారణాలని విశ్లేషించింది. భారత్‌తో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో మందగమనం కారణంగా IMF వృద్ధి రేటును తగ్గించిన నేపథ్యంలో చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపినాథ్ మాట్లాడారు.

<strong>ఆదాయపు పన్నుపై గార్గ్ కీలక సూచనలు</strong> ఆదాయపు పన్నుపై గార్గ్ కీలక సూచనలు

భారత్ ప్రధాన కారణం..

భారత్ ప్రధాన కారణం..

ప్రపంచ వృద్ధి రేటు తగ్గడానికి భారత్ కూడా ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. ప్రపంచ వృద్ధి రేటును 2019కి గాను 2.9 శాతం, 2020కి గాను 3.3 శాతం అంచనా వేశామని, కానీ ఇందులో ఎక్కువగా భారత్ వంటి దేశాల మందగమనమే కారణమని అభిప్రాయపడ్డారు.

80 శాతం బాధ్యత ప్రపంచానిదే..

80 శాతం బాధ్యత ప్రపంచానిదే..

భారత దేశంలోని ఆర్థిక మందగమనం ప్రపంచ అంచనాలను ఎంత వరకు ప్రభావితం చేసిందని అడగగా.. దాదాపు 80 శాతానికి పైగా ప్రభావితం చేసి ఉండి ఉంటుందని గీతా గోపినాథ్ అన్నారు. IMF భారత వృద్ది రేటును 2019కి గాను 4.8 శాతం అంచనా వేయగా, 2020లో 5.8 శాతం, 2021లో 6.5 శాతం అంచనా వేస్తోంది.

భారత్ కోలుకుంటోంది..

భారత్ కోలుకుంటోంది..

భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై గీతా గోపినాథ్ మాట్లాడుతూ... భారత్ క్రమంగా కోలుకోవడాన్ని మనం చూస్తున్నామని, వచ్చే ఏడాది గణనీయంగా రికవరీ కానుందని, వ్యవస్థ అవసరమైన ద్రవ్య ఉద్దీపనలు కలిగి ఉందని, కార్పోరేట్ పన్నును కూడా కేంద్ర ప్రభుత్వం తగ్గించింది, రానున్న ఏడాదిలో వృద్ధి పట్టాలు ఎక్కించేందుకు ఇవి ఉపకరిస్తాయని చెప్పారు. నిరర్థక ఆస్తుల గురించి స్పందిస్తూ.. ప్రభుత్వం ముందు ఉన్న అతి పెద్ద సవాల్ అన్నారు.

చిదంబరం ఏమన్నారంటే?

IMF భారత వృద్ధి రేటు అంచనాలను తగ్గించిన నేపథ్యంలో మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం స్పందించారు. ఇక మంత్రులు IMF, భారత్‌లో జన్మించిన చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపినాథ్‌పై విమర్శలు గుప్పిస్తారేమోనని అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దును గీతా వ్యతిరేకించారన్నారు. అంతేకాదు, వృద్ధి రేటు అంచనా 4.8 శాతం కంటే తగ్గినా ఆశ్చర్యం లేదేమో అని ట్వీట్ చేశారు.

వృద్ధి రేటు 4.8 శాతమే..

వృద్ధి రేటు 4.8 శాతమే..

భారత వృద్ధిరేటు అంచనాలను 2020కి గానూ 4.8శాతంకు తగ్గించిన విషయం తెలిసిందే. 2021 ఆర్థిక సంవత్సరానికి ఈ అంచనా వృద్ధిరేటు 5.8 శాతం ఉండనుందని వెల్లడించింది. 2022 ఆర్థిక సంవత్సరం నాటికి భారత వృద్ధిరేటు 6.5 శాతానికి చేరుకుంటుందని పేర్కొంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టార్, క్రెడిట్ గ్రోత్ క్షీణత కారణంగా భారత వృద్ధిరేటు అంచనాల తగ్గుదలకు కారణమయ్యాయని తెలిపింది. భారత దేశీయ డిమాండ్ అనుకున్నదానికంటే వేగంగా పడిపోయిందని పేర్కొంది. అదే విధంగా అంతర్జాతీయ వృద్ధిరేటును కూడా ఐఎంఎఫ్ తగ్గించింది. 2019లో అంచనా వృద్ధిరేటు 2.9శాతానికి, 2020కి 3.3శాతానికి, 2021 ఆర్థిక సంవత్సరానికి 3.4శాతానికి తగ్గించింది. రానున్న రెండేళ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ భారత్ లాంటి దేశాలు వృద్ధిరేటును సల్పంగా పెంచుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని తెలిపింది. ఎమర్జింగ్ మార్కెట్, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు 2019లో 3.7శాతం ఉంటే, 2020 నాటికి 4.4శాతంగా, 2021లో 4.6శాతానికి పెరుగుదల నమోదు చేస్తాయని అంచనా వేసింది. 0.2శాతం పెరుగుదులను నమోదు చేస్తున్నాయని వెల్లడించింది.

English summary

తగ్గిన వృద్ధి రేటు అంచనా: భారత్ 80% కారణమన్న IMF గీతా గోపీనాథ్ | India responsible for 80% of slashed global growth estimate: IMF chief economist

As the International Monetary Fund (IMF) cut down global growth forecasts owing to the economic slowdown in India and other emerging markets, the chief economist of the International Monetary Fund (IMF), Gita Gopinath said that India was primarily responsible for the downgrade in global growth.
Story first published: Tuesday, January 21, 2020, 11:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X