For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత జీడీపీ వృద్ధి రేటు మైనస్ 11.8 శాతం, ఇండియా రేటింగ్స్ అంచనా

|

2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు మైనస్ 11.8 శాతం ఉండవచ్చునని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. గతంలో మైనస్ 5.3 ఉండగా, తాజాగా రెండింతల కంటే ఎక్కువ ప్రతికూలత నమోదు చేస్తుందని అంచనా వేసింది. అదే సమయంలో 2021-222 నాటికి జీడీపీ వృద్ధి రేటు 9.9 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. భారత చరిత్రలో ఈ జీడీపీ వృద్ధి రేటు (మైనస్ 11.8 శాతం) కనిష్టం. ఈ స్థాయికి జీడీపీ ఎప్పుడూ పతనం కాలేదు.

భారత ఆర్థికవ్యవస్థ -10.5%, ఫిచ్ రేటింగ్ భారీ కోతభారత ఆర్థికవ్యవస్థ -10.5%, ఫిచ్ రేటింగ్ భారీ కోత

1951 నుండి అందుబాటులో ఉన్న జీడీపీ డేటా ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ ఐదుసార్లు ప్రతికూలత నమోదు చేసంది. FY-1958, FY-1966, FY-1967, FY-1973, FY-1980 కాగా, ఈ ఆర్థిక సంవత్సరం ఆరోసారి. అంతకుముందు 1980లో 5.2 శాతం ప్రతికూలత నమోదు చేసింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో భారత జీడీపీ 23.9 శాతం ప్రతికూలత నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక నష్టం రూ.18.44 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా.

India Ratings revises FY21 GDP growth projection to negative 11.8 percent

అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ కూడా 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ రేటుకు భారీ కోత విధించింది. దాదాపు 10.5శాతం మేర ప్రతికూలత నమోదు చేస్తుందని అంచనా వేస్తుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత జీడీపీ 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 23.9 శాతం ప్రతికూలత నమోదు చేసింది. రానున్న రెండు క్వార్టర్లలోను ప్రతికూలత నమోదు కావొచ్చునని, నాలుగో క్వార్టర్‌లో మాత్రం కాస్త పుంజుకోవచ్చునని అంచనా వేస్తున్నారు.

English summary

భారత జీడీపీ వృద్ధి రేటు మైనస్ 11.8 శాతం, ఇండియా రేటింగ్స్ అంచనా | India Ratings revises FY21 GDP growth projection to negative 11.8 percent

Domestic rating agency India Ratings and Research on Tuesday revised the country's FY21 GDP growth forecast to (-) 11.8 per cent from (-) 5.3 per cent earlier.
Story first published: Tuesday, September 8, 2020, 21:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X