For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Survey: కంపెనీ బోర్డుల్లో మహిళలు.. 12వ స్థానంలో ఇండియా, ఇంటి బడ్జెట్‌లో భార్య హవా

|

కంపెనీల్లోని బోర్డుల్లో మహిళలకు స్థానం కల్పించే అంశంలో ప్రపంచ దేశాల్లో భారత్ 12వ స్థానంలో నిలిచింది. వుమెన్ ఆన్ బోర్డ్ 2020 పేరిట అంతర్జాతీయ నియామక సంస్థ మై హైరింగ్ క్లబ్ డాట్ కామ్, సర్కారీ నౌకరీ డాట్ ఇన్ఫో సంస్థలు సర్వే నిర్వహించాయి. భారత్ సహా 36 దేశాల్లో 7,824 నమోదిత కంపెనీల నుంచి సమీకరించిన వివరాలతో ఈ నివేదిక రూపొందించారు.

రూ.45,000 దాటిన బంగారం ధర, అమ్మకానికి సరికొత్త ప్లాన్!రూ.45,000 దాటిన బంగారం ధర, అమ్మకానికి సరికొత్త ప్లాన్!

సర్వేలో 628 లిస్టెడ్ కంపెనీలు

సర్వేలో 628 లిస్టెడ్ కంపెనీలు

ఈ సర్వేలో భారత్‌లో 628 లిస్టెడ్ కంపెనీలు పాల్గొన్నాయి. ఇందులో 55 శాతం కంపెనీల్లో మహిళా డైరెక్టర్లు ఉన్నారు. గత ఏడాది కంటే ఇది పద్నాలుగు శాతం అధికం. భారత్‌లో బోర్డు డైరెక్టర్‌గా పురుషుల పదవీ కాలం సగటున మూడేళ్లు కాగా, మహిళలది మాత్రం ఇంతకంటే తక్కువగా ఉంది. దేశీయంగా 39% మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నా, వీరిలో మధ్య, సీనియర్ స్థాయి మేనేజ్‌మెంట్‌కు చేరుతున్న వారి సంఖ్య తక్కువగా ఉంది.

గృహిణులదే హవా..

గృహిణులదే హవా..

మరో ఆన్‌లైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ స్క్రిప్ బాక్స్ చేసిన అధ్యయనంలో పొదుపు, సంపాదన, పెట్టుబడులు, ఆర్థిక నిర్ణయాల్లో గృహిణుల హవా నడుస్తున్నట్లు తేలింది. కుటుంబ ఆర్థిక నిర్ణయాలలో ఇల్లాలిదే పైచేయి అని తేలింది. పొదుపు, కష్టార్జితాలపై వారిలో పెరిగిన అవగాహన, ఇంటికి ఆర్థిక మంత్రులుగా చేసింది.

మహిళలకు ప్రాధాన్యత పెరిగింది..

మహిళలకు ప్రాధాన్యత పెరిగింది..

కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో మహిళలకు ఎంతో ప్రాధాన్యత పెరిగిందని, మగవారితో పోల్చితే వారి నిర్ణయాలే ఎక్కువ అని ఈ సర్వేలో తేలింది. కేవలం 10% మందే మగవారికి ఆర్థిక నిర్ణయాలు వదిలేస్తున్నారని తేలింది. దేశవ్యాప్తంగా 600లకు పైగా మహిళలు తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు.

English summary

Survey: కంపెనీ బోర్డుల్లో మహిళలు.. 12వ స్థానంలో ఇండియా, ఇంటి బడ్జెట్‌లో భార్య హవా | India ranked 12th in women member presence on companies board globally

With more and more organisations in the country realising the importance of gender parity, a recent study has revealed that India ranks 12th globally in women member presence on board.
Story first published: Monday, March 9, 2020, 14:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X