For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నరేంద్రమోడీ 5 ట్రిలియన్ డాలర్ల కల ఎప్పుడు నెరవేరుతుందంటే?

|

భారత జీడీపీ 2028-29 ఆర్థిక సంవత్సరానికి ముందు 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగకపోవచ్చునని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) డేటా వెల్లడిస్తోంది. భారత జీడీపీని 5 ట్రిలియన్ డాలర్లకు తీసుకు వెళ్లాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కరోనా, మందగమనం వంటి అంశాలు లక్ష్యాన్ని ఆలస్యం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఐఎంఎఫ్ FY29 ఆర్థిక సంవత్సరం నాటికి గాని ఈ టార్గెట్ అందుకునే అవకాశాలు లేవని పేర్కొంది.

క‌రోనా కారణంగా భారత్ సహా ప్రపంచ ఆర్ధిక వ్య‌వ‌స్ధ కుదేలయింది. దీంతో మోడీ ప్రభుత్వం 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంపై ప్రతికూల ప్రభావం చూపింది. కీల‌క మైలురాయి దిశ‌గా భార‌త్ ప్ర‌స్ధానం పైన ప్ర‌తికూల ప్ర‌భావం చూపింది. ఇటీవల ఉక్రెయిన్-ర‌ష్యా యుద్ధం నేపథ్యంలో FY2023లో భార‌త వృద్ధిరేటు అంచ‌నాలను ఐఎంఎఫ్ 8.2 శాతానికి తగ్గించింది.

India may not become a $5 trillion economy before FY29, IMF

ఐఎంఎఫ్ డేటా బేస్ ప్రకారం భారత నామినల్ జీడీపీ FY28 నాటికి 4.92 లక్షల కోట్లకు చేరుకోవచ్చు. అంటే కరోనా కంటే ముందు 2019లో భారత ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలని కేంద్రం భావించినప్పటికీ, కరోనా సహా వివిధ కారణాల వల్ల FY29 నాటికి అంటే నాలుగేళ్లు ఆలస్యం కావొచ్చునని చెబుతున్నారు. ఐఎంఎఫ్ ప్రకారం FY21లో భారత జీడీపీ గ్రోత్ అంచనాలు 2.67 లక్షల కోట్లు, FY22లో 3 లక్షల కోట్లు, FY23కి 3.29 లక్షల కోట్లు, FY24లో 3.58 లక్షల కోట్లు, FY25లో 3.89 లక్షల కోట్లు, FY26లో 4.23 లక్షల కోట్లు, FY27లో 4.57 లక్షల కోట్లు, FY28లో 4.92 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవచ్చు.

English summary

నరేంద్రమోడీ 5 ట్రిలియన్ డాలర్ల కల ఎప్పుడు నెరవేరుతుందంటే? | India may not become a $5 trillion economy before FY29, IMF

The GDP of India will hit the target of $5 trillion not before FY29, the International Monetary Fund’s updated database shows.
Story first published: Thursday, May 5, 2022, 15:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X