For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2020లో కంపెనీలకు 568 శాతం లాభం, అయినా భారీగా ఉద్యోగాలు కట్

|

కరోనా కారణంగా 2020 క్యాలెండర్ ఏడాదిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. వివిధ రంగాలు, పరిశ్రమలు ఏడాది ప్రారంభంలో నష్టపోయాయి. కొన్ని రంగాలు నష్టపోయినప్పటికీ ఎక్కువ కంపెనీలు లేదా రంగాలు ఏడాది ముగిసేసరికి అనూహ్య లాభాలు నమోదు చేశాయి. అదే సమయంలో ఉద్యోగులు చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. లాక్ డౌన్ సమయంలో భారీగా నష్టపోయిన లిస్టెడ్ కంపెనీలు ఆ తర్వాత గతంలో ఎన్నడూ చూడని లాభాలు నమోదు చేశాయి. ఈ మేరకు ప్రయివేట్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(CMIE) తాజా ఆర్టికల్ వెల్లడించింది.

వర్క్ ఫ్రమ్ హోమ్ ఎఫెక్ట్, పడిపోయిన ఆఫీస్ స్పేస్ లీజింగ్వర్క్ ఫ్రమ్ హోమ్ ఎఫెక్ట్, పడిపోయిన ఆఫీస్ స్పేస్ లీజింగ్

ఇలా తగ్గించాయి

ఇలా తగ్గించాయి

FY21 సెప్టెంబర్ త్రైమాసికం ముగిసేనాటికి 4,234 లిస్టెడ్ కంపెనీలు ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్‌ను విశ్లేషించింది. లా‌క్‌డౌన్ కాలంలో సంస్థలు ముడి సరుకు వినియోగం, నిర్వహణ వ్యయాలు భారీగా తగ్గించాయి. కరోనా కాలంలో కంపెనీల ఆదాయం 6.9 శాతం పడిపోయింది. అయితే ముడి సరుకు, ఫినిష్డ్ గూడ్స్ కొనుగోళ్లు సంస్థలకు పెద్ద ఖర్చు. ఈ సమయంలో అది 18.9 శాతానికి తగ్గించాయి. కరోనా ఆంక్షల నేపథ్యంలో వేతనాలు 3.4 శాతం పెరిగినా, ఇతర ఖర్చులు మాత్రం 9 శాతం తగ్గించాయి.

568 శాతం వృద్ధి

568 శాతం వృద్ధి

ఏడాది ప్రాతిపదికన కంపెనీల వృద్ధి 568.5 శాతంగా నమోదయింది. 2018 మార్చిలో లాభాల్లో వృద్ధి రేటు మైనస్ 98 శాతం కాగా, 2019 మార్చిలో 356 శాతం ఎగిసింది. సెప్టెంబర్ త్రైమాసికానికి మైనస్ 90 శాతానికి పడిపోయాయి. వీటిని పరిగణలోకి తీసుకుంటే లాభాలు 569 శాతం పెరిగాయని, ఇది అసాధారణమని సీఎంఐఈ తెలిపింది. కార్పోరేట్ సంస్థల ఖర్చుల్లో శాలరీ 7 శాతం నుండి 10 శాతంగా ఉన్నాయి. రెండో త్రైమాసికంలో 3.4 శాతం వేతనాలు పెంచినా సంస్థల లాభాలపై ప్రభావం చూపలేదు. అంతకుముందు వేతన కోతలు భారీగా ఉండటం వల్ల ఆ సంస్థలు భారీగా వృద్ధిని నమోదు చేసినట్లు CMIE తెలిపింది.

50 శాతం తగ్గించాయి

50 శాతం తగ్గించాయి

4,234 కంపెనీలలో 2,150 కంపెనీలు లేదా 50 శాతం కంపెనీలు రెండో త్రైమాసికంలో వేజ్ బిల్‌ను ఏడాది క్రితం స్థాయికి తగ్గించాయి. 463 కంపెనీలు వేజ్ బిల్లు పెరిగింది. 339 కంపెనీల వేజ్ బిల్లు 6.92 శాతం కంటే తక్కువగా ఉంది. మొత్తంగా 2,952 కంపెనీలు లేదా 70 శాతం కంపెనీల వేజ్ బిల్లు తగ్గింది.

English summary

2020లో కంపెనీలకు 568 శాతం లాభం, అయినా భారీగా ఉద్యోగాలు కట్ | India Inc saw 568.5 percent jump in profit but still fired employees

Listed companies made highest-ever profits in the midst of a severe lockdown by cutting costs a lot more sharply than they suffered fall in sales, private think tank Centre for Monitoring Indian Economy (CMIE) in its latest article has said. It says that though these companies made a killing during the lockdown, they still resorted to significant layoffs and wage cuts.
Story first published: Wednesday, December 30, 2020, 13:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X