For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Covid 19: భారీగా తగ్గిన కంపెనీల ఆదాయం, జూన్‌లో మరింత దిగజారుతుంది

|

అంతకుముందు మందగమనం, ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి-మార్చి )లో భారత కంపెనీల ఆదాయాలు 2018-19 ఇదే కాలంతో పోలిస్తే 22 శాతం క్షీణిస్తాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిన విషయం తెలిసిందే. కంపెనీల నష్టపోవడంతో పాటు ఉద్యోగాలు పోవడం లేదా వేతనాల కోతకు ఎన్నో కంపెనీలు పూనుకున్నాయి.

రిలయన్స్ డెబిట్ ఫ్రీ, గడువుకు ముందే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా: ముఖేష్ అంబానీరిలయన్స్ డెబిట్ ఫ్రీ, గడువుకు ముందే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా: ముఖేష్ అంబానీ

184 కంపెనీలలో సర్వే

184 కంపెనీలలో సర్వే

ఫైనాన్షియల్ సెక్టార్ మినహా మిగతా రంగాలకు చెందిన 184 కంపెనీల సర్వే ఆధారంగా ఈ నివేదిక తయారు చేసింది. దీని ప్రకారం కంపెనీల ఆదాయం సగటున 22 శాతం వరకు పడిపోయే అవకాశముంది. పూర్తి ఆర్థిక సంవత్సరం 2019-20లో ఆదాయాలు 2018-19తో పోలిస్తే 12 శాతం తగ్గాయని తెలిపింది. కరోనాను అరికట్టేందుకు మార్చి చివరి వారం నుండి రెండు నెలలకు పైగా లాక్ డౌన్ విధించడంతో జూన్ క్వార్టర్‌లోను ప్రతికూల ప్రభావం ఉంటుందని తెలిపింది.

ఆదాయ క్షీణత.. తగ్గిన నిర్వహణ లాభం

ఆదాయ క్షీణత.. తగ్గిన నిర్వహణ లాభం

కార్పోరేట్ ఆదాయాలపై కరోనా భయాల వల్లే, ఇన్వెస్టర్లు ఈక్విటీల నుండి వైదొలగుతున్నారని తెలిపింది. మార్చి క్వార్టర్‌లో ఆదాయ క్షీణత అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మార్చి క్వార్టర్‌లో 2.9 శాతం తగ్గిందని, ఇక నిర్వహణ లాభం మార్జిన్లు 0.30 శాతం తగ్గి 16.8 శాతానికి చేరుకుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌లో భారత కంపెనీల పనితీరుపై వినియోగదారుడు, కమోడిటీ అనుసంధఆన రంగాలపై ప్రభావం పడిందని పేర్కొంది. కరోనా కారణంగా మరింత పెరిగిందని తెలిపింది. పన్నుకు ముందు లాభాలు 7.1 శాతం తగ్గిపోయినట్లు తేలింది.

అమ్మకాల్లో క్షీణత

అమ్మకాల్లో క్షీణత

ఎఫ్ఎంసీజీ, మన్నికైన వినియోగ వస్తువులు, వాహన రంగాల అమ్మకాల్లో క్షీణత లేదా స్వల్ప వృద్ధి మాత్రమే నమోదయిందని ఇక్రా తెలిపింది. కస్టమర్ సెంటిమెంట్ దెబ్బతినడాన్ని ఇది సూచిస్తోందని వెల్లడించింది. ఐటీ రంగాల్లో కూడా క్షీణత నమోదయినట్లు తెలిపింది.

English summary

Covid 19: భారీగా తగ్గిన కంపెనీల ఆదాయం, జూన్‌లో మరింత దిగజారుతుంది | India Inc's Q4 net profit takes a 22 percent hit due to Covid 19

An ICRA results analysis of 184 companies, excluding financial sector entities, indicates 22 per cent fall YoY in net profit in the March quarter. The March quarter performance also dented 2019-20 (FY20) bottom line, which fell 12 per cent over the year-ago quarter
Story first published: Friday, June 19, 2020, 16:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X