For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

OTP Troubles: కొత్త నిబంధనలు, నిలిచిపోయిన OTP సేవలు

|

OTPకి సంబంధించి సోమవారం అంతరాయం ఏర్పడింది. వాణిజ్య సందేశాల నియంత్రణ కోసం టెల్కోలు సోమవారం నుండి కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చాయి. అయితే ఈ కొత్త నిబంధనలు గందరగోళానికి దారితీశాయి. దీంతో నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు చెల్లింపులు, రైల్వే టిక్కెట్ బుకింగ్, ఈ-కామర్స్, ఆధార్ ధృవీకరణ, కోవిన్ దరఖాస్తు వంటి ఆన్‌లైన్ సేవల్లో అంతరాయం కలిగింది.

ఎస్సెమ్మెస్, OTP సందేశాలు కస్టమర్లకు రాలేదు. సోమవారం సాయంత్రం వరకు దాదాపు 40 శాతం సందేశాలు నిలిచిపోయాయి. టెల్కోలు అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధనలతో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ సమస్య వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఇటు టెలికం కంపెనీలు, అటు పేమెంట్ వంటి ఇతరసంస్థలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి.

India Faced Disruption in Banking OTP Services

కొత్త నిబంధనలను అమలు చేసే ప్రక్రియలో కంపెనీలు చేసిన తప్పిదం అంతరాయానికి కారణమైనట్లు టెలికం సంస్థలు వెల్లడించాయి. సందేశాలు పంపించేవారి ఐడీలను కొత్తగా తీసుకు వచ్చిన బ్లాక్ చైన్ ప్లాట్‌ఫాంపై రిజిస్టర్ చేయకపోవడం వల్ల సందేశాలు వెళ్లలేదని తెలిపాయి. వాణిజ్య సందేశాలకు సంబంధించి మూడేళ్ల క్రితం ట్రాయ్ కొత్త నిబంధనలు జారీ చేయగా, ఇవి నిన్నటి నుండి అమల్లోకి వచ్చాయి.

English summary

OTP Troubles: కొత్త నిబంధనలు, నిలిచిపోయిన OTP సేవలు | India Faced Disruption in Banking OTP Services

Implementation of the second phase of new SMS regulations by telecom companies in India on Monday, 8 March, caused disruption of crucial SMS services like OTPs from banks and e-Commerce companies.
Story first published: Tuesday, March 9, 2021, 15:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X