For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ టాప్ 5 మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో భారత ఈక్విటీ

|

మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలోనే భారత్ ఐదో స్థానానికి చేరుకున్నది. సంపదపరంగా భారత్ అయిదో అతిపెద్ద ఈక్విటీ మార్కెట్‌గా అవతరించడం లేదా ఈ క్లబ్‌లోకి రావడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ మొత్తం క్యాపిటలైజేషన్ 3.21 లక్షల కోట్ల డాలర్లుగా (3.21 ట్రిలియన్ డాలర్లు) ఉంది. బ్రిటన్, సౌదీ అరేబియా, కెనడా వంటి దేశాలతో పోల్చినా భారత మార్కెట్ క్యాప్ కాస్త ఎక్కువే ఉంది.

బ్రిటన్ మార్కెట్ క్యాప్ 3.19 ట్రిలియన్ డాలర్లు, సౌదీ అరేబియా 3.18 ట్రిలియన్ డాలర్లు, కెనడా 3.18 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మన స్టాక్ మార్కెట్ సంపద 7.4 శాతం క్షీణించింది. అయినప్పటికీ రెండు స్థానాలు ఎగబాకడం గమనార్హం. అంటే ప్రపంచ దేశాల మార్కెట్ క్యాప్ కంటే మనది కాస్త పెరుగుతోంది. ప్రస్తుత క్యాలెండర్ (2022) ఇయర్ ప్రారంభంలో బ్రిటన్ 3.7 ట్రిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో, ఫ్రాన్స్ 3.5 ట్రిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో నిలిచాయి. కానీ వివిధ కారణాల వల్ల వీటి మార్కెట్ క్యాప్ భారీగా పడిపోయింది.

India breaks into worlds top five club in terms of market capitalisation

ఉక్రెయిన్ పైన రష్యా దాడి నేపథ్యంలో యూరోపియన్ దేశాల మార్కెట్ క్యాప్‌కు కోత పడింది. ఒకప్పుడు టాప్ 5లో ఉన్న జర్మనీ ఇప్పుడు పదవ స్థానానికి పడిపోయింది. సౌదీ అరేబియా మూడు స్థానాలు ఎగబాకి 10వ స్థానం నుండి ఏడో స్థానానికి వచ్చింది. ఆరామ్‌కో ఈ సంవత్సరం చమురు ధరల పెరుగుదల కారణంగా భారీగా లాభపడింది.

సౌదీ ప్రభుత్వ యాజమాన్య చమురు దిగ్గజ షేర్లు 15 శాతానికి పైగా పెరిగాయి. కంపెనీ వ్యాల్యూ దాదాపు 2.4 ట్రిలియన్ డాలర్ల నుండి 2.6 ట్రిలియన్ డాలర్లకు ఎగబాకింది. ప్రపంచంలోనే అత్యంత మార్కెట్ క్యాప్ కలిగిన ఆపిల్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది.

మార్కెట్ క్యాప్ పరంగా టాప్ దేశాల విషయానికి వస్తే 47.32 ట్రిలియన్ డాలర్లతో అమెరికా, 11.52 ట్రిలియన్ డాలర్లతో చైనా, 6 ట్రిలియన్ డాలర్లతో జపాన్, 5.55 ట్రిలియన్ డాలర్లర్లతో హాంగ్‌కాంగ్, 3.21 ట్రిలియన్ డాలర్లతో భారత్ టాప్ 5లో ఉన్నాయి. ఆ తర్వాత యూకే 3.19 ట్రిలియన్ డాలర్లు, సౌదీ అరేబియా 3.18 ట్రిలియన్ డాలర్లు, కెనడా 3.18 ట్రిలియన్ డాలర్లు, ఫ్రాన్స్ 2.89 ట్రిలియన్ డాలర్లు, జర్మనీ 2.29 ట్రిలియన్ డాలర్లతో 5 నుండి 10 స్థానాల్లో ఉన్నాయి.

English summary

ప్రపంచ టాప్ 5 మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో భారత ఈక్విటీ | India breaks into world's top five club in terms of market capitalisation

India’s equity market has broken into the world’s top five club in terms of market capitalisation for the first time. The country’s total market cap stands at $3.21 trillion, which is higher than that of the UK ($3.19 trillion), Saudi Arabia ($3.18 trillion), and Canada ($3.18 trillion).
Story first published: Sunday, March 13, 2022, 11:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X