For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గత ఏడాది కంటే మెరుగు, లంచాల జాబితాలో 77వ స్థానంలో భారత్

|

భారత్‌లో వ్యాపార నిర్వహణకు లంచం ఇవ్వాల్సిన పరిస్థితులు ఎక్కువే ఉన్నాయని తేలింది. ప్రపంచవ్యాప్తంగా లంచాల కోసం వచ్చే డిమాండ్ ఆధారంగా తయారు చేసిన సూచీలో భారత్ 77వ స్థానంలో ఉంది. 194 దేశాల్లో పరిస్థితులను అంచనా వేయడం ద్వారా ట్రేస్ అనే సంస్థ దీనిని రూపొందించింది. ఇందులో 45 స్కోరుతో మన దేశం 77వ స్థానంలో ఉంది. గత ఏడాది 48 స్కోరుతో 78వ స్థానంలో ఉంది. ముడుపులను నిరోధించే వ్యవస్థలు, ప్రభుత్వ-పౌరసేవల్లో పారదర్శకత, ప్రభుత్వంతో వ్యాపార చర్చలు, మీడియా పాత్ర వంటి అంశాలను అధ్యయనం చేసి ఆయా దేశాలకు స్కోర్ ఇచ్చింది.

ఐక్య రాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆర్థిక వేదికల నుండి కూడా సమాచారం ఇచ్చింది. గత ఏడాది 78వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 77వ స్థానంతో కాస్త మెరుగు పడటం గమనార్హం. లంచానికి వ్యతిరేకంగా పనిచేస్తోన్న ట్రేస్ సంస్థ 'బిజినెస్ బ్రైబరీ రిస్క్స్ ఆఫ్ 2020' పేరిట ఈ నివేదిక విడుదల చేసింది.

LVB crisis: లక్ష్మీ విలాస్ బ్యాంకు నుండి రూ.5 లక్షలు తీసుకోవచ్చు.. ఇలాLVB crisis: లక్ష్మీ విలాస్ బ్యాంకు నుండి రూ.5 లక్షలు తీసుకోవచ్చు.. ఇలా

India at 77 in global bribery risk rankings, improves by one spot

194 దేశాలు, వివిధ ప్రాంతాలకు సంబంధించిన ఈ జాబితాలో ఉత్తర కొరియా, దక్షిణ సూడాన్, వెనిజులా ఎక్కువ లంచాలను ఆశించే దేశాలుగా నిలిచాయి.డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, న్యూజిలాండ్ దేశాల్లో లంచాల ప్రభావం తక్కువగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. చైనా, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే భారత్‌ మెరుగైన స్థితిలో ఉంది.

English summary

గత ఏడాది కంటే మెరుగు, లంచాల జాబితాలో 77వ స్థానంలో భారత్ | India at 77 in global bribery risk rankings, improves by one spot

India is at 77th position with a score of 45 in a global list that measures business bribery risks of 2020.
Story first published: Friday, November 20, 2020, 9:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X