For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్‌కంటాక్సే ఎక్కువ.. కార్పొరేట్ టాక్స్ కన్నా.. ఇదీ డేటా..

|

ఇన్​కంటాక్స్​ వసూళ్లు కార్పొరేషన్​ టాక్స్​ వసూళ్లను మించిపోయాయి. ఇన్​కంటాక్స్​ వసూళ్లు ఎక్కువవడం 12 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 2020-21 ఫైనాన్షియల్ ఇయర్​కు అకౌంట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చాలా ఏళ్లుగా ఇన్​కంటాక్స్ వసూళ్ల కంటే కార్పొరేషన్​ టాక్స్​ వసూళ్లు ఎక్కువగా రికార్డ్ అవుతున్నాయి. 2020-21లో ఇన్​కంటాక్స్​ వసూళ్లు రూ. 4.69 లక్షల కోట్లు కాగా.. కార్పొరేషన్​ టాక్స్​ వసూళ్లు రూ. 4.57 లక్షల కోట్లే. అంటే ఇన్​కంటాక్స్​ వసూళ్లు కార్పొరేషన్​ టాక్స్​ వసూళ్ల కంటే రూ. 12 వేల కోట్లు ఎక్కువ.

దేశంలో ఇండివిడ్యువల్స్​, హిందూ అన్​డివైడెడ్​ ఫ్యామిలీస్​లు ఇన్​కంటాక్స్​ చెల్లిస్తారు. తమకు వచ్చే లాభాలపై కంపెనీలు చెల్లించేది కార్పొరేషన్​ టాక్స్​.ఇన్​కంటాక్స్​ వసూళ్లు కార్పొరేషన్​ టాక్స్​ వసూళ్ల కంటే ఎందుకు ఎక్కువ అయ్యాయనేది ఇప్పుడు ప్రశ్న. కిందటేడాది కరోనా వైరస్​ ఎఫెక్ట్​తో వ్యాపారాలన్నీ కుదేలవడమే కంపెనీల లాభాలు తగ్గడానికి కారణం. ఫలితంగా ఆ కంపెనీలు తక్కువ టాక్స్​ చెల్లించాయి. కొంచెం లోతుగా చూస్తే... ఇదొక్కటే కారణం కాదని తెలుస్తుంది.

income tax revenue is higher than corporate tax

లిస్టెడ్​ కంపెనీల లాభాలు 2020-21లో జీడీపీలో 2.6 శాతానికి పెరిగాయి. 2014-15 తర్వాత ఇంత ఎక్కువ ఉండటం ఇదే మొదటిసారి. 2014-15లో లిస్టెడ్​ కంపెనీల లాభాలు జీడీపీలో 3.1 శాతంగా నమోదయ్యాయి. నిజానికి ఇంకా కొన్ని కంపెనీలు తమ ఫైనాన్షియల్​ రిజల్ట్స్​ ప్రకటించాల్సి ఉంది. ఇక 2019-20కి చూస్తే లిస్టెడ్​ కార్పొరేట్ల లాభాలు జీడీపీలో 1.1 శాతంగా ఉన్నాయి. 2020-21లో లిస్టెడ్​ కంపెనీల ప్యాట్​ లేదా నికర మార్జిన్​ 9.1 శాతం. 2007-08 ఫైనాన్షియల్​లోని 10.2 శాతం తర్వాత ఇదే ఎక్కువ. కాకపోతే, కార్పొరేషన్​ టాక్స్​ను అన్​లిస్టెడ్​ కంపెనీలు కూడా చెల్లిస్తాయి.

2020-21లో ఇన్​కంటాక్స్​ వసూళ్లు కార్పొరేషన్​ టాక్స్​ వసూళ్లను మించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2019-20తో పోలిస్తే కార్పొరేషన్​ టాక్స్​ వసూళ్లు 17.9 శాతం తగ్గాయి. ఆ ఏడాదిలో ఈ వసూళ్లు రూ. 5.57 లక్షల కోట్లు. 2019-20తో పోలిస్తే ఇన్​కంటాక్స్​ వసూళ్లు 2.3 శాతమే తగ్గాయి. 2019-20లో ఇన్​కంటాక్స్​ వసూళ్లు రూ. 4.8 లక్షల కోట్లు. కార్పొరేషన్​ టాక్స్​ రేటును అంతకు ముందున్న 30 శాతం నుంచి 22 శాతానికి సెప్టెంబర్​ 2019లో ప్రభుత్వం తగ్గించింది. కొత్త మాన్యుఫాక్చరింగ్​ కంపెనీలకైతే 25 శాతం నుంచి 15 శాతానికి టాక్స్​ రేటును తగ్గించారు.

English summary

ఇన్‌కంటాక్సే ఎక్కువ.. కార్పొరేట్ టాక్స్ కన్నా.. ఇదీ డేటా.. | income tax revenue is higher than corporate tax

income tax revenue is higher than corporate tax central government showns data.
Story first published: Wednesday, June 2, 2021, 19:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X