For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Income Tax Returns: ఆన్‌లైన్‌లో రీఫండ్ స్టేటస్ తెలుసుకోవడం ఎలా..?

|

మీరు టాక్స్ పేయరా..? ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేశారా..? ఒకవేళ చేసి ఉంటే ఆ ప్రక్రియ ఏ దశలో ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ ప్రక్రియను అనుసరిస్తే చాలు.. మీరు దాఖలు చేసిన ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ఏ దశలో ఉందో తెలుస్తుంది.

అసలు కట్టాల్సిన పన్ను కంటే ఎక్కువగా పన్ను కట్టి ఉంటే దాన్ని తిరిగి పొందొచ్చు. మీరు ఇన్‌కంటాక్స్ రీఫండ్‌కు అర్హులు అవుతారు. ఐటీఆర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత 20 నుంచి 45 రోజుల్లో మీ డబ్బులు మీరు ఇచ్చిన బ్యాంకు ఖాతాలో డిపాజిట్ అవుతుంది. ఒక్కసారి ఐటీఆర్ ఫైల్ చేశాక రీఫండ్‌ను క్లెయిమ్ చేసుకుని ఉంటే... దాని స్టేటస్‌ లేదా రీఫండ్ వివరాలు ఆన్‌లైన్‌లో పొందొచ్చు.

ఇక 10 జనవరి 2021 అర్థరాత్రి సమయానికి దాదాపుగా 31 లక్షల ఐటీఆర్‌ల ఫైల్ అయ్యాయి. ఇందులో దాదాపుగా 2 లక్షల ఐటీఆర్‌లు చివరి ఒక గంటలో ఫైల్ అయ్యాయి. జనవరి 10వ తేదీ సాయంత్రం 6 గంటల సమయానికల్లా 17,97,625 ఐటీఆర్‌లు ఫైల్ అయ్యాయి. అదే విధంగా సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య 2,39,013 ఐటీఆర్‌లు ఫైల్ అయినట్లు ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది. వ్యక్తిగత పన్ను చెల్లింపునకు ఆదాయపు పన్ను శాఖ జనవరి 10వ తేదీ వరకు గడువు ఇవ్వగా... కంపెనీలకు ఫిబ్రవరి 15వరకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది.

Income Tax: Do you know how to check your ITR Refund status?

అసలు ఇన్‌కమ్ టాక్స్ రీఫండ్ అంటే ఏమిటి..?

ఒక ఆర్థిక సంవత్సరానికి గాను ఒక వేళ కట్టాల్సిన పన్ను కంటే ఎక్కువగా లేదా అధికంగా పన్ను కట్టి ఉంటే ఆ అధిక మొత్తాన్ని తిరిగి టాక్స్ పేయర్‌కు చెల్లించే ప్రక్రియనే ఇన్‌కమ్ టాక్స్ రీఫండ్ అని పిలుస్తారు. ఈ అధిక మొత్తాన్ని ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 237 ప్రకారం తిరిగి పొందొచ్చు. ఇందుకోసం చేయాల్సిందల్లా...

ముందుగా రీఫండ్‌ను ట్రాక్ చేసేందుకు NSDL వెబ్‌సైట్‌ను సందర్శించాలి

* పాన్ వివరాలు, ఆధార్ వివరాలు, అసెస్‌మెంట్ సంవత్సరం నింపాలి

* వివరాలన్నీ పొందుపర్చాకా Proceed అనే బటన్‌ పై క్లిక్ చేయండి

* వెంటనే మీ ఇన్‌కమ్‌ టాక్స్ రీఫండ్ స్టేటస్ వివరాలు కంప్యూటర్ స్క్రీన్‌ పై కనిపిస్తాయి

ITR స్టేటస్‌ను ఈ - ఫైలింగ్ పోర్టల్ పై ఎలా చెక్ చేసుకోవాలి

* ముందుగా ఇన్‌కమ్‌ టాక్స్‌ శాఖకు సంబంధించిన ఈ-ఫైలింగ్ పోర్టల్‌పై లాగిన్ అవ్వండి

* అక్కడ View returns or forms అనే ఆప్షన్‌ను ఎంచుకోండి

* అనంతరం My Account అనే టాబ్ పై క్లిక్ చేసి Income Tax Returns అనే బటన్ పై క్లిక్ చేసి సబ్మిట్ చేయండి

* ఆ తర్వాత అక్నాలెడ్జ్ నెంబర్ పై క్లిక్ చేయాలి

* దీంతో మీ ఇన్‌కమ్ టాక్స్ రీఫండ్ స్టేటస్ కంప్యూటర్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది

* ఒక వేళ రీఫండ్ ప్రక్రియ సంబంధిత శాఖ అప్పటికే ప్రారంభించి ఉంటే మీ మొబైల్‌కు ఒక మెసేజ్ వస్తుంది

English summary

Income Tax Returns: ఆన్‌లైన్‌లో రీఫండ్ స్టేటస్ తెలుసుకోవడం ఎలా..? | Income Tax: Do you know how to check your ITR Refund status?

Once you file your ITR and claim a tax refund, you can check the status of your refund online.
Story first published: Monday, January 11, 2021, 14:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X