For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Dolo-650: డోలో-650 తయారీదారుపై ఐటీ రైడ్స్.. కీలక పత్రాల పరిశీలన.. 40 ప్రాంతాల్లో..

|

Dolo-650: పన్ను ఎగవేత ఆరోపణలపై గత రెండేళ్లలో కోవిడ్-19 రోగులు విరివిగా వాడుతున్న డోలో-650 టాబ్లెట్ తయారీదారులైన బెంగళూరుకు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ ప్రాంగణంలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. కంపెనీ 2020లో కోవిడ్-19 వ్యాప్తి చెందినప్పటి నుంచి 350 కోట్ల డోలో-650 టాబ్లెట్లను విక్రయించటం ద్వారా రూ.400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు కంపెనీ సీఎండీ దిలీప్ సురానా కంపెనీ వెబ్ సైట్ లోని ఓ కథనంలో తెలిపారు.

ఐటీ దాడులు..

ఐటీ దాడులు..

ప్రస్తుతం డోలో మాత్రలు తెలియని వారు ఉండరనటం అతిశయోక్తి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. గత రెండేళ్లలో కొవిడ్-19 రోగులు ఈ ట్యాబ్రెట్లను చాలా విరివిగా వినియోగించారు. అయితే డోలో-650 ట్యాబ్లెట్ తయారీదారులు, పన్ను ఎగవేత ఆరోపణలపై బెంగళూరుకు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ ఆవరణలో ఆదాయపు పన్ను శాఖ బుధవారం సోదాలు నిర్వహించింది. సోదాల్లో భాగంగా కంపెనీ ఆర్థిక లావాదేవీలకు చెందిన కీలక పత్రాలు, బ్యాలెన్స్ షీట్లు, బిజినెస్ డిస్ట్రిబ్యూటర్ నెట్‌వర్క్‌లను విభాగం పరిశీలిస్తోందని అధికారులు తెలిపారు. ఏకకాలంలో కంపెనీకి చెందిన అనేక ప్రదేశాల్లో దాదాపు 200 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీ, సిక్కిం, పంజాబ్, తమిళనాడు, గోవా వంటి 40కి పైగా ప్రదేశాల్లో రైడ్స్ నిర్వహించినట్లు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి.

కంపెనీ వ్యాపార నిర్వహణ..

కంపెనీ వ్యాపార నిర్వహణ..

ఇతర నగరాల్లోని కంపెనీకి సంబంధించిన మరికొన్ని లింక్డ్ లొకేషన్‌లతో పాటు కంపెనీ ప్రమోటర్లు, డిస్ట్రిబ్యూటర్లను కూడా ఆదాయపన్ను అధికారులు కవర్ చేస్తున్నారు. కంపెనీ తన వెబ్‌సైట్‌లో ఉంచిన వివరాల ప్రకారం.. ఔషధ ఉత్పత్తులు, API (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రెడియంట్స్) తయారీ, మార్కెటింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో కంపెనీకి దేశవ్యాప్తంగా 17 తయారీ యూనిట్లు ఉన్నాయని, ఇతర దేశాల్లోనూ ఈ సంస్థ వ్యాపారం నిర్వహిస్తోందని పేర్కొంది.

డోలోను ఎందుకు వినియోగిస్తారు..

డోలోను ఎందుకు వినియోగిస్తారు..

కంపెనీ తయారు చేస్తున్న ప్రధాన ఫార్మా ఉత్పత్తుల్లో.. డోలో-650, అమ్లాంగ్, లుబ్రెక్స్, డయాప్రైడ్, విల్డాప్రైడ్, ఓల్మాట్, అవాస్, ట్రిప్రైడ్, బాక్టోక్లావ్, టెనెప్రైడ్-ఎమ్, అర్బిటెల్ వంటి ఔషధాలు ఉన్నాయి. డోలో-650, అనాల్జేసిక్, యాంటిపైరేటిక్ ని వైద్యులు, మెడికల్ షాపు యజమానులు కరోనావైరస్ రోగులకు నొప్పి, జ్వరం, కొవిడ్ వల్ల కలిగే సాధారణ లక్షణాలను తగ్గించడానికి ప్రిస్క్రైబ్ చేసేవారు.

కంపెనీ వెబ్‌సైట్ ఫిబ్రవరిలో ప్రచురించిన ఒక వార్తా కథనాన్ని తన వెబ్‌సైట్‌లో ప్రదర్శించింది: "కంపెనీ 2020లో కోవిడ్-19 వ్యాప్తి చెందినప్పటి నుండి 350 కోట్ల టాబ్లెట్‌లను (డోలో-650) విక్రయించింది మరియు రూ. 400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. సంవత్సరం."

Read more about: income tax
English summary

Dolo-650: డోలో-650 తయారీదారుపై ఐటీ రైడ్స్.. కీలక పత్రాల పరిశీలన.. 40 ప్రాంతాల్లో.. | Income Tax department raided on Dolo-650 manufacturer offices and other locations over alleged tax evasion

Income Tax department raided on bangalore based Dolo-650 manufacturer offices
Story first published: Thursday, July 7, 2022, 10:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X