భారత ప్రభుత్వానికి గత ఆర్థిక సంవత్సరంలో (2020-21) వచ్చిన పన్ను ఆదాయంలో కార్పొరేట్ ట్యాక్స్ కంటే ఇన్‌కం ట్యాక్స్ ద్వారానే ఎక్కువ ఆదాయం వచ్చింది. కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా వచ్చిన మొత్తం కంటే ఇన్‌కం ట్యాక్స్ ద్వారా ఎక్కువ ఆదాయం రావడం 12 ఏళ్లలో ఇది తొలిసారి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ద్వారా ఈ విషయం వెల్లడవుతోంది.
ఆదాయ పన్ను వ్యక్తుల ఆదాయంపై వేసేది. కంపెనీల లాభాలపై వేసే పన్ను కార్పోరేట్ ట్యాక్స్. ఇలా 2020-21 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ ట్యాక్స్ రూపంలో రూ.4.57 లక్షల కోట్లు రాగా, ఇన్‌కం ట్యాక్స్ రూపంలో రూ.4.69 లక్షల కోట్లు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు 18 శాతం, ఇన్‌కం ట్యాక్స్ వసూళ్లు 2.3 శాతం క్షీణించాయి.

నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక 10 శాతం మేర కార్పొరేట్ ట్యాక్స్‌ను (25 శాతానికి) తగ్గించింది. దీంతో కార్పొరేట్ పన్ను వసూళ్లు తగ్గాయి. పైగా 2019లో ఆర్థిక మందగనం, 2020, 2021లో కరోనా సంక్షోభం కారణంగా కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు తగ్గాయి. 2018-19లో 6.6 లక్షల కోట్లుగా ఉన్న కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు 2019-20లో 16 శాతం, 2020-21లో 18 శాతం క్షీణించాయి. మొత్తం 31 శాతం తగ్గాయి.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications