For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పరిస్థితులు అంచనాలను మించి దిగజారాయ్.. సంక్షోభానికి అవే కారణాలు: IMF

|

Economic Outlook: అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థల్లో పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. అవి చాలా ఆందోళనకరంగా మారాయని ఐఎంఎఫ్ పేర్కొంది. గ్లోబల్ ఎకనామిక్ ఔట్‌లుక్ గత నెలలో అంచనా వేసిన దానికంటే మరింత దిగజారిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవలి నెలల్లో కొనుగోలు మేనేజర్ సర్వేలు క్రమంగా దిగజారుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఆదివారం తెలిపింది.

ఆందోళనల కారణాలు..

ఆందోళనల కారణాలు..

నిరంతరంగా ద్రవ్యోల్బణం పెరగటం, కరోనా లాక్ డౌన్ వల్ల చైనాలో బలహీనమైన వృద్ధి, కొనసాగుతున్న ఉక్రెయిన్‌పై రష్యా దాడి వల్ల సరఫరాల అంతరాయం, పెరుగుతున్న ఆహార ధరలు ఆందోళనకరంగా మారిన పరిస్థితులకు కారణమని ఐఎంఎఫ్ నిందించింది. 2023కి ప్రపంచ వృద్ధి గత నెలలో ఇచ్చిన 2.9% నుంచి 2.7%కి తగ్గించింది.

జీ-20 సమావేశం..

జీ-20 సమావేశం..

ఇండోనేషియాలో నిర్వహించనున్న G20 నాయకుల శిఖరాగ్ర సమావేశానికి సిద్ధం చేసిన బ్లాగ్‌లో ఐఎంఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఊహంచినదానికంటే దిగజారాయని మరీ ముఖ్యంగా ఐరోపాలో పరిస్థితి చేజారుతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి తెలిపింది. ఈ క్రమంలో ద్రవ్యోల్బణం మెుడిగా అలాగే కొనసాగుతుండగా.. ఆర్థిక కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి.

మరిన్ని సవాళ్లు..

మరిన్ని సవాళ్లు..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు అపారమమైనవని.. ఇవి రానున్న కాలంలో సవాళ్లను మరింతగా పెంచుతాయని IMF పేర్కొంది. ఐరోపాలో తీవ్రమవుతున్న ఇంధన సంక్షోభం వృద్ధికి తీవ్ర హాని కలిగిస్తూ ద్రవ్యోల్బణాన్ని పెంచుతోందని అభిప్రాయపడింది.

సుదీర్ఘకాలం..

సుదీర్ఘకాలం..

ఐరోపాపై ద్రవ్యోల్బణం భారం సుదీర్ఘకాలం కొనసాగుతుందని అంచనా వేసినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం అది ఊహించినదాని కంటే ఎక్కువ కాలం కొనసాగవచ్చని తెలుస్తోంది. ఇది వడ్డీ రేట్ల పెంపుకు కూడా కారణంగా మారి రుణ సంక్షోభం ప్రమాదాన్ని పెంచుతుందని ఐఎంఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. పెరుగుతున్న తీవ్రమైన వాతావరణ సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా వృద్ధిని కుంటుపడేలా చేస్తాయని తెలిపింది.

Read more about: imf economy inflation europe
English summary

పరిస్థితులు అంచనాలను మించి దిగజారాయ్.. సంక్షోభానికి అవే కారణాలు: IMF | IMF worries over global economic Situations worsening than projected last month

IMF worries over global economic Situations worsening than projected last month
Story first published: Monday, November 14, 2022, 11:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X