IIT హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ప్యూర్ఈవీ సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్లోకి తీసుకు వస్తోంది. ఐఐటీ హైదరాబాద్ - ప్యూర్ ఈవీ సంయుక్తంగా ఈ స్కూటర్‌ను దేశీయ మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 116 కిలో మీటర్ల దూరం ఇది ప్రయాణిస్తుంది. సరసమైన ధరల్లో ఈ వాహనం లభిస్తుంది.

ఈ వాహనం పేరు... ఈ-ఫ్లూటో 7జీ
ఈ సరికొత్త ఎలక్ట్రిక్ వాహనానికి ఈ-ఫ్లూటో 7Gగా నామకరణం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ ప్రాంగణం పక్కనే ఈ సంస్థ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేశారు. నెలకు 2వేల ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో నిర్మించారు.

కిలో మీటర్ ప్రయాణ ఖర్చు 30 పైసలు
ఈ నెల 9వ తేదీన నీతి అయోగ్ సభ్యులు డాక్టర్ వీకే సారస్వత్, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెకక్రటరీ జయేష్ రంజన్‌లు ఈ స్కూటర్‌ను మార్కెట్లోకు విడుదల చేస్తారు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 116 కి.మీ. ప్రయాణించవచ్చు. ప్రయాణ ఖర్చు కూడా కి.మీ.కు 25 నుంచి 30 పైసలు మాత్రమే.

రెండు వేరియంట్లలో వెహికిల్స్
ఈప్లూటో, ఈప్లూటో 7G అనే రెండు వేరియంట్లలో ఈ ఎలక్ట్రానిక్ వెహికిల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. ప్యూర్ ఈవీ బ్యాటరీల తయారీ సంస్థ. కానీ ఐఐటీ హైదరాబాద్ సహకారంతో రూ.350 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్ స్కూటర్‌ను తయారు చేసింది.

డిమాండు ఆధారంగా ఉత్పత్తి
దేశంలోని మధ్యతరగతి వినియోగదారులు లక్ష్యంగా అందుబాటు ధరకే వీటిని అందించాలని భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 2 వేల స్కూటర్ల తయారీకి ప్రణాళికలు సిద్ధం చేశారు. డిమాండును బట్టి ఉత్పత్తి పెంచేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఎక్స్‌షోరూం ధరను కూడా ఈ నెల 9న జరిగే ప్రారంభ కార్యక్రమంలో ప్రకటిస్తారు. ధరలు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications