For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సిండికేట్ బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్, జూలై 1 నుండి IFSC కోడ్ మార్పు

|

కెనరా బ్యాంకులో విలీనమైన సిండికేట్ బ్యాంకు కస్టమర్ల IFSC కోడ్స్ జూలై 1వ తేదీ నుండి మారనున్నాయి. NEFT, RTGS, IMPS ద్వారా నగదు ట్రాన్సాక్షన్స్‌కు ఇక నుండి కెనరా బ్యాంకు IFSC కోడ్స్‌ను వినియోగించాలి. ప్రభుత్వరంగ బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా గత ఏడాది ఏప్రిల్ నెలలో సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకులో విలీనం చేశారు. ఈ విలీనం అనంతరం కెనరా బ్యాంకు నాలుగో అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. ఖాతాదారులు కొత్త IFSC కోడ్స్‌ను పొందవలసి ఉంటుందని బ్యాంకు తెలిపింది.

కొత్త IFSC కోడ్‌ను పొందేందుకు తమ బ్యాంకు వెబ్‌సైట్‌ను గానీ, తమ బ్యాంకు బ్రాంచీని గానీ ఖాతాదారులు సంప్రదించాలని కెనరా బ్యాంకు తెలిపింది. అలాగే, సిండికేట్ బ్యాంకు ఖాతాదారులు మారిన IFSC కోడ్, MICR కోడ్స్‌తో కూడిన చెక్కు బుక్‌లను తీసుకోవాలి. విదేశీ లావాదేవీలకు CNRBINBBFD స్విఫ్ట్ కోడ్‌ను ఉపయోగించవలసి ఉంటుందని, ఈ విషయాన్ని ఖాతాదారులు గమనించాలని కెనరా బ్యాంకు పేర్కొంది.

IFSC codes of Syndicate Bank will change from July 1

గత సిండికేట్ బ్యాంకు కస్టమర్లు మారిన కొత్త ఐఎఫ్ఎస్‌సీ, ఎంఐసీఆర్ కోడ్స్‌తో కూడిన చెక్కుబక్కులను అందిస్తున్నట్లు తెలిపింది. నెఫ్ట్, ఆర్టీజీఎస్ లేదా ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్స్ కోసం ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ (IFSC) తప్పనిసరి.

English summary

సిండికేట్ బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్, జూలై 1 నుండి IFSC కోడ్ మార్పు | IFSC codes of Syndicate Bank will change from July 1

The IFSC codes for erstwhile Syndicate Bank customers will be changed from July 1. Syndicate Bank was merged with Canara Bank last year.
Story first published: Friday, June 11, 2021, 19:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X