A Oneindia Venture

ఆధార్‌ను మొబైల్ నంబర్‌తో లింక్ చేయకపోతే జరిగే నష్టాలు ఇవే..!

ఆధార్ కార్డు ప్రతి భారతీయ పౌరుడికి అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ సేవలను అందిస్తుంది. ఆధార్‌ను వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర పనులకు ఉపయోగిస్తున్నందున దాని సమాచారాన్ని (పేరు, అడ్రస్, పుట్టిన తేదీ వంటివి) సరిగ్గా అలాగే అప్ డేట్ ఉంచడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆధార్‌ను మీ మొబైల్ నంబర్‌తో లింక్ చేయడం తప్పనిసరి. లేకపోతే మీరు చాల సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. అసలు ఆధార్‌ను ఫోన్ నంబర్‌తో లింక్ చేయడం ఎందుకు ముఖ్యం, లింక్ చేయకపోతే కలిగే నష్టాలు ఏమిటో తెలుసా...

if Aadhaar card with mobile number not linked these are disadvantages know the process

ఆధార్‌ను ఫోన్ నంబర్‌తో లింక్ చేయడం ఎందుకు అవసరం అంటే : UIDAI ప్రకారం, ఆధార్ నమోదుకి ఫోన్ నంబర్ తప్పనిసరి కానప్పటికీ, దానిని లింక్ చేయడం చాలా మంచిది. దీని వెనుక అసలు కారణం మీ గుర్తింపును వెరిఫై చేయడం. ఆధార్ ఆధారిత లావాదేవీలు లేదా అప్‌డేట్‌ల కోసం OTP (వన్-టైమ్ పాస్‌వర్డ్) మీ లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు వస్తుంది.

ఇది కాకుండా మొబైల్ నంబర్‌ను ఆధార్‌కు లింక్ చేయడం వల్ల మోసాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. మీ అనుమతి లేకుండా ఎవరూ మీ ఆధార్‌ని యాక్సెస్ చేయడం కష్టం. ఫోన్‌కు OTP రాకుండా ఎవరూ మీ ఆధార్‌ను ఉపయోగించలేరు. ఇటీవల, ఆధార్ అధికారిక 'X' (గతంలో ట్విట్టర్) అకౌంట్ ద్వారా మొబైల్ నంబర్‌తో ఆధార్‌ను లింక్ చేయాలని సూచించింది, లింక్ చేసే ప్రక్రియను కూడా షేర్ చేసింది.

ఆధార్ కార్డును మొబైల్ నంబర్‌కు ఎలా లింక్ చేయాలి:
ఆన్‌లైన్ ద్వారా: మీరు "MyAadhaar" యాప్ లేదా UIDAI పోర్టల్‌ను ఓపెన్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో ఈజీగా ఆధార్‌ను ఫోన్ నంబర్‌కు లింక్ చేయవచ్చు.
ఆధార్ సెంటర్ వెళ్లడం ద్వారా: మీరు మీ సమీపంలోని ఆధార్ సెంటర్ వెళ్ళీ కూడా ఈ పని చేయవచ్చు. ఈ సేవ కోసం మీరు రూ.50 చార్జెస్ చెల్లించాలి.

ఆధార్‌ను మొబైల్ నంబర్‌కు లింక్ చేయకపోవడం వల్ల నష్టాలు:
బ్యాంకింగ్ సేవలు: బ్యాంకులు అలాగే ఇతర బ్యాంకింగ్ సేవలను పొందడంలో సమస్యలు ఎదుర్కోవచ్చు. చాలా బ్యాంకింగ్ లావాదేవీలకు ఆధార్ OTP వెరిఫికేషన్ అవసరం.
ప్రభుత్వ పథకాలు: ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందడంలో ఇబ్బందులు రావచ్చు, ఎందుకంటే చాలా పథకాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి.
e-KYC ప్రక్రియ: మీరు e-KYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ప్రక్రియను పూర్తి చేయలేరు, దీనివల్ల చాల ఆన్‌లైన్ సేవలు నిలిచిపోతాయి. ఇవి కాకుండా ఇతర ముఖ్యమైన ఆన్‌లైన్ లేదా వెరిఫికేషన్ ఆధారిత పనులు కూడా నిలిచిపోయే అవకాశం ఉంది.
కాబట్టి, మీ ఆధార్ కార్డును మీ మొబైల్ నంబర్‌కు సకాలంలో లింక్ చేసుకోవడం చాలా ముఖ్యం.

మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి:
* మొదట UIDAI అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
* 'మై ఆధార్' (My Aadhaar) సెక్షన్ పై క్లిక్ చేయండి.
* ఆ తర్వాత, మీ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి.
* ఆధార్ నంబర్ ఇంకా క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
* 'వెరిఫై' (Verify) పై క్లిక్ చేయండి.
* మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ అయిందో లేదో తెలిపే మెసేజ్ మీకు కనిపిస్తుంది. లింక్ చేసి ఉంటే ఫోన్ నంబర్ చివరి మూడు అంకెలు మెసేజులో చూపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+