For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చందాకొచ్చార్‌కు మరోషాక్.. రికవరీ చేయండి.. కోర్టులో ఐసీఐసీఐ పిటిషన్

|

చందాకొచ్చార్ నుంచి తమకు రావాల్సిన రూ.12 కోట్లు రికవరీ చేయాలంటూ ఐసీఐసీఐ బ్యాంకు బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో హోదా నుంచి ఆమెను తొలగించిన నేపథ్యంలో నియామక రద్దును అమలులోకి తీసుకు రావాలని కూడా కోరింది.

చందాకొచ్చార్ తన తొలగింపును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఐసీఐసీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. చందాకొచ్చార్‌కు 2016 ఏప్రిల్ నుంచి 2018 మార్చి మధ్య ఇచ్చిన బోనస్‌ల మొత్తాన్ని క్లాబాక్ నిబంధనల మేరకు తిరిగి ఇప్పించాలని ఐసీఐసీఐ దావా వేసిందని, చందాకొచ్చార్ సేవల రద్దు ఇందుకు నేపథ్యమని ఐసీఐసీఐ తన అఫిడవిట్లో పేర్కొంది.

అదిరిపోయే బడ్జెట్‌తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరచండి: సీతారామన్‌కు ఆనంద్ మహీంద్రాఅదిరిపోయే బడ్జెట్‌తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరచండి: సీతారామన్‌కు ఆనంద్ మహీంద్రా

ICICI Bank seeks recovery of Rs 12 crore from Chanda Kochhar

ఉద్యోగి అవకతవకలకు పాల్పడితే బోనస్ వంటి ప్రోత్సాహకాల వేతనాలను వెనక్కి తీసుకునే వెసులుబాటును క్లాబాక్ అంటారు. అదే సమయంలో తొలగింపును సవాల్ చేస్తూ చందాకొచ్చార్ పిటిషన్ దాఖలు చేయడం కూడా ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని ఐసీఐసీఐ బ్యాంకు తన అఫిడవిట్లో పేర్కొంది.

వీడియోకాన్ గ్రూప్‌కు రూ.3,250 కోట్ల రుణాలు ఇవ్వడంలో ఎండీ, సీఈఓగా చందాకొచ్చార్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొంది. ఈ నేరపూరిత చర్యలతో బ్యాంక్‌ ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బతిన్నదని, కాబట్టి ఆమె అందుకున్న బోనస్, ఇతర ప్రోత్సాహకాలు తిరిగి ఇచ్చేలా ఆమెను ఆదేశించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం 20వ తేదీకి వాయిదా వేసింది.

English summary

చందాకొచ్చార్‌కు మరోషాక్.. రికవరీ చేయండి.. కోర్టులో ఐసీఐసీఐ పిటిషన్ | ICICI Bank seeks recovery of Rs 12 crore from Chanda Kochhar

ICICI Bank has filed a civil recovery suit against former Chief Executive Officer Chanda Kochhar for the recovery of Rs 12 crore that she had received as bonus and other benefits during her tenure.
Story first published: Tuesday, January 14, 2020, 13:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X