For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐసీఐసీఐ బ్యాంకు గోల్డెన్ ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు పెంపు

|

సీనియర్ సిటిజన్లకు ఐసీఐసీఐ బ్యాంకు గుడ్ న్యూస్. వీరి కోసం బ్యాంకు ప్రత్యేక వడ్డీ రేటును ఇచ్చే గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డీ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. సాధారణ ఎఫ్‌డీ వడ్డీ రేటు కంటే ఇందులో సీనియర్ సిటిజన్లకు అదనంగా ఇచ్చే 0.50 శాతానికి తోడుగా మరో 0.25 శాతం ఎక్కువ వడ్డీ వస్తుంది. తద్వారా బ్యాంకు ఈ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డీ 6.5 శాతాన్ని అందిస్తోంది.

ఈ ప్రత్యేక ఆఫర్ రూ.2 కోట్ల కంటే తక్కువ వ్యాల్యూ కలిగిన డిపాజిటకు లభిస్తుంది. 5 ఏళ్ల ఒక్కరోజు నుండి పదేళ్ల వరకు కాలపరిమితిగల ఫిక్స్డ్ డిపాజిట్లపై 2022 అక్టోబర్ 7 వరకు ఈ ప్రత్యేక వడ్డీ రేటు ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం తాజాగా ప్రారంభించిన డిపాజిట్లకు, ఈ స్కీమ్ అమలులో ఉన్న సమయంలో రెన్యువల్ చేసే డిపాజిట్లకు ఈ ప్రత్యేక వడ్డీ రేటు లభిస్తుంది. కాలపరిమితికంటే ముందుగా ఉపసంహరించుకుంటే 1.25 శాతం పెనాల్టీ రేటు వర్తిస్తుంది.

ICICI Bank Hikes Interest Rates On Golden Years FD

రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై ఐసీఐసీఐ కొత్త వడ్డీ రేట్లు 21 మే నుండి అమలులోకి వచ్చాయి. ఇవి ఇలా ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్ ఎఫ్‌డీ వడ్డీ రేటు ఏడాది కాలపరిమితిపై 5.60 శాతం ఉంది. అయిదేళ్ల ఒకరోజు నుండి పదేళ్ల కాలపరిమితిపై 6.50 శాతం వడ్డీ రేటు ఉంది.

English summary

ఐసీఐసీఐ బ్యాంకు గోల్డెన్ ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు పెంపు | ICICI Bank Hikes Interest Rates On Golden Years FD

ICICI Bank, a private sector lender, has raised interest rates on a special term deposit scheme for elderly adults effective 21st May 2022.
Story first published: Wednesday, May 25, 2022, 9:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X