For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ICICI బ్యాంకు గుడ్‌న్యూస్, ఆ ప్రత్యేక వడ్డీ రేటు స్కీమ్ పొడిగింపు

|

ప్రయివేటురంగ ఐసీఐసీఐ బ్యాంకు వయో వృద్ధుల కోసం తీసుకు వచ్చిన అదనపు వడ్డీ రేట్ల ప్రయోజనం పథకం గోల్డెన్ ఇయర్స్ FD రేట్స్ పథకం గడువును పొడిగించింది. జనవరి 20, 2022న అమలులోకి వచ్చింది ఈ పథకం. 2022 ఏప్రిల్ 8వ తేదీతో ముగియాల్సి ఉంది. అయితే అక్టోబర్ 7, 2022 వరకు దీనిని కొనసాగించనున్నట్లు బ్యాంకు తన వెబ్ సైట్ ద్వారా వెల్లడించింది. ఈ పథకం కింద భారత్‌లో నివసిస్తున్న వృద్ధులకు డిపాజిట్స్ పైన ఏడాదికి అదనంగా ఇచ్చే 0.50 శాతం వడ్డీ రేటుకు మరో 0.25 శాతం అదనపు వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ పథకం పరిమిత కాలం పాటు అమలులో ఉంటుంది.

ఈ పరిమిత సమయంలో చేసిన కొత్త డిపాజిట్లు, పునరుద్ధరణ చేసిన డిపాజిట్లకు మాత్రమే ఈ అదనపు వడ్డీ రేటు ప్రయోజనం లభిస్తుంది. అయిదేళ్లకు మించి కాలపరిమితితో చేసే డిపాజిట్లకు మాత్రమే ఈ అదనపు వడ్డీ రేటు వర్తిస్తుంది. ప్రస్తుతం సాధారణ వడ్డీ రేటు అయిదేళ్ల ఒకరోజు నుండి పదేళ్ల వరకు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై ఐసీఐసీఐ బ్యాంకు 5.6 శాతం వడ్డీ రేటు ఇస్తోంది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

 ICICI Bank Extends Special FD Scheme For Senior Citizens

వృద్ధులకు ఈ ప్రత్యేక పథకం కింద అదనంగా 0.5 శాతానికి మరో 0.25 శాతం కలిపి 6.35 శాతం వడ్డీని చెల్లిస్తోంది. మరో రెండు దిగ్గజ బ్యాంకులు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI), HDFC బ్యాంకులు కూడా సీనియర్ సిటిజన్స్ కోసం స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్‌ను తీసుకు వచ్చాయి.

English summary

ICICI బ్యాంకు గుడ్‌న్యూస్, ఆ ప్రత్యేక వడ్డీ రేటు స్కీమ్ పొడిగింపు | ICICI Bank Extends Special FD Scheme For Senior Citizens

ICICI Bank, which was slated to discontinue its Golden Years FD plan for older residents on April 8th, has now extended the deadline to October 7th, 2022. This is particularly favourable for older persons, as it comes just one day after the RBI decided to leave policy rates unchanged.
Story first published: Sunday, April 10, 2022, 9:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X