For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IBM: భారత ఉద్యోగులకు ఐబీఎం హెచ్చరిక.. MD Sandip Patel సీరియస్ ఈ-మెయిల్

|

IBM: గత 15 సంవత్సరాలుగా ఐటీ కంపెనీల వృద్ధితో పాటు వాటి సీఈవోల జీతాలు సైతం విపరీతంగా పెరిగాయి. అయితే కంపెనీల వృద్ధి కోసం పాటుపడుతున్న కిందిస్థాయి ఉద్యోగులకు చాలా తక్కువగా జీతాలు పెరిగాయి. దీంతో చాలా మంది ఐటీ డిమాండ్ క్యాష్ చేసుకుంటూ రెండో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.

 మూన్‌లైటింగ్..

మూన్‌లైటింగ్..

అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఐబీఎం మూన్‌లైటింగ్ చేయకూడదంటూ హెచ్చరిక జారీ చేసింది. ఉద్యోగులకు అంతర్గత ఈ-మెయిల్‌ ద్వారా IBM ఇండియా MD సందీప్ పటేల్ ఈ విషయంలో కంపెనీ వైఖరిని మరోసారి పునరుద్ఘాటించారు. కంపెనీ ప్రయోజనాలను పణంగా పెట్టి చేపట్టే ఎలాంటి వ్యక్తిగత కార్యకలాపాలనైనా ఉపేక్షించేదిలేదని ఉద్యోగులకు స్పష్టం చేశారు.

 గందరగోళం లేకుండా..

గందరగోళం లేకుండా..

మూన్‌లైటింగ్ చాలా గందరగోళాన్ని సృష్టిస్తుందని పటేల్ నొక్కి చెప్పారు. మూన్‌లైటింగ్ కాన్సెప్ట్ గురించి గ్రాన్యులర్ స్థాయిలో స్పష్టం చేయకపోతే చాలా గందరగోళాన్ని కలిగిస్తుందని అన్నారు. రెండు ఉద్యోగాలు లేదా సైడ్ గిగ్ కలిగి ఉండటం వల్ల రెండింటి మధ్య సంఘర్షణ చోటుచేసుకుంటుందని అన్నారు. పైగా మూన్‌లైటింగ్ కి పాల్పడటం అంటే కంపెనీ నమ్మకాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు.

ఇన్ఫోసిస్..

ఇన్ఫోసిస్..

ఇటీవల ముందస్తు అనుమతితో ఉద్యోగం చేస్తుండగానే గిగ్ వర్క్ చేసుకునేందుకు ఇన్ఫోసిస్ అంగీకరించింది. దీంతో చాలా దిగ్గజ కంపెనీల్లో బేజారు మెుదలైంది. కానీ నేడు ఐబీఎం ప్రకటనతో కంపెనీలకు విశ్వాసాన్ని పెంచుతుందని చెప్పుకోవాలి. మూన్ లైటింగ్ పై ఆదిలోనే గందరగోళానికి ముగింపు పలికేందుకు నిర్ణయించుకుని ఈ ప్రకటన చేస్తున్నట్లు సందీప్ పటేల్ చెప్పటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఐబీఎంలో పనిచేస్తున్నప్పుడు రెండో ఉద్యోగం, పార్ట్ టైమ్ వర్క్, కాంట్రాక్ట్ వర్క్ వంటి వాటిల్లో నిమగ్నమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఐబీఎం ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్ కూడా తెలిపారు.

 మధ్యతరహా టెక్ కంపెనీలు..

మధ్యతరహా టెక్ కంపెనీలు..

ఐటీ రంగంలోని పెద్ద కంపెనీలు చేయని పనిని చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు చేస్తున్నాయి. దీనికి తోడు స్టార్టప్ కంపెనీలు రెండో ఉద్యోగం, కాంట్రాక్ట్ వర్క్, పార్ట్ టైం పని వంటి విషయాలను ఓపెన్ గా ఆఫర్ చేస్తున్నాయి. దీనిపై టెక్కీలు తమ కంపెనీల నుంచి అనుమతి తీసుకోమని సూచిస్తున్నాయి. జోహో, కిస్‌ఫ్లో, M2P పిన్‌టెక్ వంటి ప్రముఖ స్టార్టప్‌లు తమ ఉద్యోగులతో ప్రీలైట్ చేయడం గురించి చాలా బహిరంగ చర్చలు జరుపుతున్నాయి.

 దారిమళ్లుతున్నది వీరే..

దారిమళ్లుతున్నది వీరే..

చిన్న, మధ్య తరహా టెక్ కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు ఆఫర్లు చాలా మందిని మార్చేస్తున్నాయి. 1-4 ఏళ్ల అనుభవం ఉన్న టెక్ ఉద్యోగులు ఎక్కువగా ఇలాంటి కంపెనీల్లో పనిచేసేందుకు మెుగ్గు చూపుతున్నట్లు వెల్లడైంది.

Read more about: moonlighting it company jobs ibm
English summary

IBM: భారత ఉద్యోగులకు ఐబీఎం హెచ్చరిక.. MD Sandip Patel సీరియస్ ఈ-మెయిల్ | IBM India MD Sandip Patel emailed Employees Over moonlighting

IBM India MD Sandip Patel emailed Employees Over moonlighting
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X