For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IBM: ఐబీఎం మెగా ప్లాన్.. ఆనందంలో భారత టెక్కీలు.. 5 లక్షల మందికి తీపికబురు..

|

IBM: లేఆఫ్ హీట్ అమెరికా నుంచి ఇండిలోని కంపెనీలకు సైతం పాకింది. ఇందులో ముందుగా స్టార్టప్ కంపెనీలు ముందువరుసలో తొలగింపులను ఇప్పటికే ప్రారంభించాయి. తాజాగా బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే హైరెక్ట్ సంస్థ ఈ రోజు తన మెుత్తం ఉద్యోగుల్లో 40 శాతం మందిని తొలగించాలని నిర్ణయించింది. ఇదే క్రమంలో యూఎస్ టెక్ దిగ్గజం ఐబీఎం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది భారత టెక్కీలకు భవిష్యత్తులో మంచి అవకాశాలను కల్పిస్తుంది.

ఐబీఎం ప్రకటన..

ఐబీఎం ప్రకటన..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద ఐటీ ఆధారిత కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్న తరుణంలో ఐబీఎం మాత్రం టెక్కీలకు తీపి కబురు చెప్పింది. రానున్న 5 ఏళ్లలో భారత్ లో దాదాపు 5 లక్షల మంది టెక్కీలకు సైబర్ సెక్యూరిటీ రంగంలో నిపుణులుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు సీనియర్ అధికారి వెల్లడించారు.

సైబర్ సెక్యూరిటీ..

సైబర్ సెక్యూరిటీ..

మారుతున్న కొత్త సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. IBM ఈ మార్కెట్‌లో సైబర్‌ సెక్యూరిటీలో భారీ పెట్టుబడిని కొనసాగిస్తుందని సెక్యూరిటీ APAC చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ క్రిస్ హాకింగ్స్ వెల్లడించారు. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం లక్షల ఉద్యోగాలకు ఆజ్యం పోస్తుందని తెలుస్తోంది. భవిష్యత్ టెక్ అవసరాలను తీర్చటంతో పాటు కంపెనీ వృద్ధికి ఇది ఎంతగానో దోహదం చేస్తుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భారత్ కీలకం..

భారత్ కీలకం..

తన వ్యాపారానికి ఐబీఎంకు భారత మార్కెట్ చాలా కీలకమైనది. అందుకే కంపెనీ సైబర్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌కు భారతదేశాన్ని కేంద్రంగా చేసుకుంది. దీనికి తోడు ఇతర భద్రతా ఉత్పత్తులను కంపెనీ ఇక్కడ అభివృద్ధి చేసి ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తోంది. అందుకే పురాతన ఐటీ కంపెనీ IBM మన దేశంలో తన సైబర్‌ సెక్యూరిటీ బేస్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. అందుకే IBM USలోని బోస్టన్ తర్వాత మనదేశంలో తన రెండవ సైబర్ సెక్యూరిటీ హబ్‌ను ఏర్పాటు చేసింది. సైబర్ రేంజ్, ఆపరేషనల్ కమాండ్ సెంటర్, డెవలప్‌మెంట్ సెక్యూరిటీ వంటి కీలక విభాగాలు దేశంలో ఉన్నాయి.

5 ఏళ్లలో.. 5లక్షల ఉద్యోగాలు..

5 ఏళ్లలో.. 5లక్షల ఉద్యోగాలు..

ఐబీఎం సైబర్ సెక్యూరిటీ కలలో భాగంగా రానున్న 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ఈ క్రమంలో కంపెనీ తన కార్యకలాపాలను రానున్న కాలంలో మరింత విస్తరిస్తుందని తెలుస్తోంది.

English summary

IBM: ఐబీఎం మెగా ప్లాన్.. ఆనందంలో భారత టెక్కీలు.. 5 లక్షల మందికి తీపికబురు.. | IBM descided to train 5 lakh IT employees in next 5 years in cyber security

IBM descided to train 5 lakh IT employees in next 5 years in cyber security
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X