For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Hyderabad: ఇస్రోకి పోటీగా హైదరాబాద్ స్టార్టప్.. నింగిలో సంచనాలు..

|

Skyroot Aerospace: హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ ఇటీవల భారీ విజయాన్ని సాధించింది. విజయవంతంగా రాకెట్ ప్రయోగాన్ని చేపట్టిన తొలి ప్రైవేట్ కంపెనీగా దేశంలో చరిత్ర సృష్టించింది. 2023లో ఉపగ్రహాన్ని ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది కంపెనీ. అయితే ప్రస్తుతం చేపడుతున్న ప్రయోగాల ఖర్చులో సగానికే దీనిని నిర్వహిస్తామని స్టార్టప్ చెబుతోంది.

సింగపూర్ ఫండ్..

సింగపూర్ ఫండ్..

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీకి సింగపూర్ సావరిన్ ఫండ్ పెట్టుబడులు పెడుతోంది. రెండవ ప్రయోగానికి అవసరమైన 68 మిలియన్ డాలర్లను కంపెనీ సేకరించింది. కస్టమర్లను పెంచుకునేందుకు ఇప్పటికే 400 మందితో చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ వ్యవస్థాపకులు తెలిపారు. స్టాల్ లింక్ లాంటి కంపెనీలు చిన్న ఉపగ్రహాలను ఇంటర్నెట్ సేవలకోసం లాంట్ చేస్తున్న తరుణంలో కంపెనీ తన ఎదుగుదలకు ఈ అవకాశాలను వినియోగించుకుంటోంది. అయితే ఈ రంగంలో చైనీస్ స్టార్టప్ కంపెనీ గెలాక్టిక్ ఎనర్జీ, జపాన్‌కు చెందిన స్పేస్ వన్ నుంచి పోటీని ఎదుర్కొంటోంది.

సగం ఖర్చుకే..

సగం ఖర్చుకే..

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కంపెనీలు చేస్తున్నదానిలో సగం ఖర్చుకే ఉపగ్రహాలను ప్రయోగిస్తామని స్కైరూట్ చెబుతోంది. ఈ స్టార్టప్ ను 2018లో పవన్ చందనా, నాగ్ భరత్ దకా స్థాపించారు. ఒక్క కిలో బరువుకు వేల డాలర్ల నుంచి కేవలం 10 డాలర్లకు తగ్గించేందుకు స్టార్టప్ ప్రయత్నిస్తోంది. దీంతో ప్రయోగ ఖర్చులు భారీగా తగ్గనున్నాయి. తమకు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ స్ఫూర్తిదాయకమని చందన తెలిపారు. మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన ప్రపంచంలోనే మొదటి ప్రైవేట్ కంపెనీ అన్నారు.

సాంకేతకత విషయంలో..

చందనా, డాకాలు గతంలో ఇస్రోలో పనిచేశారు. కంపెనీ పూర్తి స్థాయి లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజిన్‌ను వారు ఆగస్టు 2020లో పరీక్షించారు. సెప్టెంబర్ 2020లో దేశంలోని మొట్టమొదటి 3డీ-ప్రింటెడ్ క్రయోజనిక్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించారు. అలా నవంబర్ 18న స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన మొదటి ప్రైవేట్ కంపెనీగా దేశంలో అవతరించింది. విక్రమ్-I 480 కిలోల పేలోడ్‌ను, విక్రమ్-II రాకెట్ 595 కిలోల పేలోడ్‌ను, విక్రమ్-III 815 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగల సామర్థ్యాలను కలిగి ఉన్నాయి.

English summary

Hyderabad: ఇస్రోకి పోటీగా హైదరాబాద్ స్టార్టప్.. నింగిలో సంచనాలు.. | Hyderbad space startup Skyroot Aerospace planning to launch satellites at cheaper cost

Hyderbad space startup Skyroot Aerospace planning to launch satellites at cheaper cost..
Story first published: Sunday, November 27, 2022, 12:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X