For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికా, చైనా నగరాలను దాటి..: ప్రపంచ మేటి నగరాల్లో హైదరాబాద్‌కు తొలిస్థానం

|

చారిత్రక హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు స్వర్గధామంలా నిలుస్తోందని JLL తమ సిటీ మెమోంటమ్ ఇండెక్స్ 2020లో వెల్లడించింది. ప్రపంచ నగరాలను మించి వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో విదేశీయాలు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని తన నివేదికలో పేర్కొంది. సామాజిక-ఆర్థిక, వాణిజ్య రియల్ ఎస్టేట్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత క్రియాశీల నగరంగా అవతరించింది.

ఇల్లు కట్టుకుంటున్నారా? అనుమతి కోసం తిరగాల్సిన అవసరంలేదు!ఇల్లు కట్టుకుంటున్నారా? అనుమతి కోసం తిరగాల్సిన అవసరంలేదు!

ప్రపంచంలోనే నెంబర్ వన్

ప్రపంచంలోనే నెంబర్ వన్

2020 సంవత్సరానికి ప్రపంచంలోని టాప్ 20 నగరాల్లో హైదరాబాదుకు మొదటి స్థానం దక్కింది. సామాజిక ఆర్థిక వ్యవస్థ, స్థిరాస్థి, వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాలు ప్రామాణికంగా 130 నగరాలను రియల్ ఎస్టేట్ రంగంలో పేరొందిన JLL సంస్థ అధ్యయనం చేసింది. వృద్ధి సూచీకల ఆధారంగా అత్యుత్తమ నగరాల జాబితాను ఈ సంస్థ ఏడేళ్లుగా ప్రకటిస్తోంది. ప్రపంచంలోనే టాప్ 20 నగరాల్లో హైదరాబాద్ రెండోసారి మొదటి స్థానం దక్కించుకుంది.

బెంగళూరును వెనక్కి నెట్టిన హైదరాబాద్

బెంగళూరును వెనక్కి నెట్టిన హైదరాబాద్

ప్రపంచ, దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినప్పటికీ సామాజిక-ఆర్థిక, వాణిజ్య రియల్ ఎస్టేట్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ ప్రపంచంలో డైనమిక్‌ సిటీగా అవతరించింది. గత ఏడాది ఈ ఇండెక్స్‌లో మొదటి స్థానాన్ని దక్కించుకొన్న బెంగళూరును హైదరాబాద్ రెండో స్థానానికి నెట్టేసింది. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినప్పటికీ దక్షిణాది నగరాలు ఉత్తమ పనితీరుతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపింది.

ఆఫీస్ స్థలానికి డిమాండ్

ఆఫీస్ స్థలానికి డిమాండ్

వేగంగా పట్టణీకరణ, పర్యావరణ ఇబ్బందులు, అధిక రద్దీ, సామాజిక అసమానతలు, సొంతిళ్ల కొరత, భద్రత, అందరికీ అందుబాటులో సేవలు పెద్ద సవాలుగా మారాయని అభిప్రాయపడింది. హైదరాబాద్ నగరంలో కార్యాలయాల స్థలం అందరికీ అందుబాటులో ఉందని, అమెజాన్ సంస్థ అతిపెద్ద క్యాంపస్‌ను నిర్మించిందని, యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్ వంటి దిగ్గజ కంపెనీలు హైదరాబాదులో కొలువుదీరాయని పేర్కొంది. అన్ని రంగాల్లోని హైదరాబాద్ వృద్ధి కనబరిచినట్లు పేర్కొంది. హైదరాబాదులో ఆఫీస్ స్పేస్‌కు ఎక్కువ ఆదరణ ఉందని, ఏడాదిలో 20 శాతం వృద్ధి సాధఇంచిందని తెలిపింది.

భారత్ నుంచి టాప్ 20లో ఏడు సిటీలు

భారత్ నుంచి టాప్ 20లో ఏడు సిటీలు

భారత్ నుంచి టాప్ 20లో ఏడు నగరాలకు చోటు దక్కింది. ఇందులో మొదటి స్థానంలో హైదరాబాద్, రెండో స్థానంలో బెంగళూరు ఉన్నాయి. ఆ తర్వాత చెన్నై 5వ స్థానం, ఢిల్లీ 6వ స్థానం, పుణే 12వ స్థానం, కోల్‌కతా 16వ స్థానం, ముంబై 20వ స్థానంలో ఉన్నాయి.

చైనా నుంచి ఈ నగరాలు..

చైనా నుంచి ఈ నగరాలు..

ఈ జాబితాలో చైనా నుంచి ఐదు నగరాలకు చోటు దక్కింది. చైనా నుంచి షెన్‌జెన్ (10), చోంగ్వింగ్ (11),పుహాన్ (13), హాంగ్‌ఝౌ (15), షాంఘై (17)వ స్థానంలో ఉన్నాయి. వీటి స్థానాలు దిగజారుతున్నాయి.

అమెరికా నుంచి...

అమెరికా నుంచి...

అమెరికా నుంచి సిలికాన్ వ్యాలీ (6), ఆస్టిన్ (19) ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికా నుంచి నైరోబీ (4), దుబాయి (14), రియాద్ (18), ఆగ్నేయాసియా నుంచి హాచీమిన్ (3), మనీలా (8) ఉన్నాయి.

మూడేళ్లలో రెండుసార్లు అగ్రస్థానం

మూడేళ్లలో రెండుసార్లు అగ్రస్థానం

కాగా, JLL సిటీ ఇండెక్స్ 2020ను మంత్రి కేటీ రామారావు శనివారం హైదరాబాదులో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ నగరాల జాబితాలో హైదరాబాద్‌ మూడేళ్లలో రెండుసార్లు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని చెప్పారు. ప్రపంచంలోని 130 నగరాలతో పోటీ పడి మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 2015లో తొలిసారి 20వ స్థానం దక్కించుకున్న హైదరాబాద్ 2016లో 5వ స్థానం, 2017లో మూడో స్థానం దక్కించుకుంది. 2018లో మొదటి స్థానం, 2019లో రెండో స్థానం, 2020లో తిరిగి మొదటి స్థానం దక్కించుకుందన్నారు.

English summary

అమెరికా, చైనా నగరాలను దాటి..: ప్రపంచ మేటి నగరాల్లో హైదరాబాద్‌కు తొలిస్థానం | Hyderabad tops socio economic, commercial real estate ranking

Hyderabad has emerged as the world''s most dynamic city on better performance in socio-economic and commercial real estate, global property consultant JLL India said.
Story first published: Sunday, January 19, 2020, 9:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X