For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెంటల్ ఇన్‌కంలో హైదరాబాద్ టాప్... సింగపూర్ కంటే కూడా బెటర్!

|

రెంటల్ ఇన్కమ్ (ఇంటి అద్దె ద్వారా సమకూరే ఆదాయం) విషయంలో మన హైదరాబాద్ దూసుకుపోతోంది. ఇండియా మొత్తంలో సగటున ప్రతి ఇంటిపై వస్తున్న అద్దె విషయంలో హైదరాబాద్ నెంబర్ 1 గా నిలిచింది. ఈ విషయంలో మనకంటే పెద్ద నగరాలైన బెంగళూరు, ముంబై మహానగరాలను కూడా మించిపోయింది. అంతే కాదండోయ్... సింగపూర్ కంటే కూడా ఈ విషయంలో మనమే బెటర్. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనారోక్ ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఇండియా లోని మెట్రో నగరాల్లో ఇంటి అద్దెల రూపంలో వస్తున్న ఆదాయాలపై ఈ సంస్థ ఒక పరిశోధన చేసింది. అందులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సహజంగా ప్రాపర్టీ ధరల విషయంలో మిగితా నగరాలతో పోల్చితే హైదరాబాద్ ధరలు చాలా వరకు అందుబాటులో ఉంటాయి. అన్ని వర్గాల వారికి ఇక్కడ కావాల్సిన ప్రాపర్టీస్ అందుబాటులో ఉంటాయి. ఒక వైపు ఆకాశ హర్మ్యాలున్నా... మరో వైపు ఇండిపెండెంట్ ఇండ్లు కూడా ఇక్కడ లభిస్తాయి. ఇలాంటి మన భాగ్యనగరంలో అద్దెలు కూడా మిగితా నగరాల కంటే తక్కువగానే ఉంటాయి. కానీ, సదరు ఇంటిపై పెట్టిన పెట్టుబడి తో పోల్చి చూస్తే వచ్చే అద్దె మాత్రం మన హైదరాబాద్ లోనే అధికంగా ఉండటం విశేషం.

హైదరాబాద్-వరంగల్, చెన్నై కారిడార్ ఇవ్వండి: కేటీఆర్హైదరాబాద్-వరంగల్, చెన్నై కారిడార్ ఇవ్వండి: కేటీఆర్

సింగపూర్ కంటే బెటర్...

సింగపూర్ కంటే బెటర్...

రియల్ ఎస్టేట్ లో ఇండ్లు, అపార్టుమెంట్లు, కమర్షియల్ ప్రాపర్టీస్ కొనుగోలు కోసం భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. మనం కొనుగోలు చేసిన ప్రాపర్టీ ధరలు అంతకంతకూ పెరిగిపోతుంటాయి కానీ అదే స్థాయిలో అద్దెలు పెరగవు. ఉదాహరణకు రూ 1 కోటి వెచ్చించి హైటెక్ సిటీ లో ఒక డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనుగోలు చేస్తే.. అది వచ్చే 5-10 ఏళ్లలో రూ 2 కోట్లు అవుతుందోమో. కానీ అదే పెట్టుబడి పెట్టి కొనుగోలు చేసిన ఫ్లాట్ కు వచ్చే అద్దె మాత్రం సగటున రూ 3,60,000 కు మించదు. అంటే కేవలం పెట్టుబడి పై 3.6% వార్షిక రాబడి మాత్రమే. అదే ప్రాపర్టీ విలువ మాత్రం ప్రతి ఏటా 10% నుంచి 20% మేరకు పెరుగుతుంది. ఈ విషయంలో దేశం ఏదైనా ... ఇన్కమ్ ఒకేలా ఉంటుంది. అద్దె రాబడిలో సింగపూర్, బీజింగ్, హాంగ్ కాంగ్ వంటి మహా నగరాల కంటే ఇండియా ముందు ఉంది. కానీ ఫిలిప్పీన్స్, ఇండోనేషియా వంటి ఆసియా దేశాల ఉంటే మాత్రం కాస్త వెనుకబడ్డాం. ఇండియాలో సగటు అద్దె ఆదాయం 3% కాగా... ఇతర ఆసియా దేశాల సగటు 3.5% నుంచి 4% వరకు ఉంటోంది. యూరోప్ లో అది 4% నుంచి 4.5% మేరకు ఉంటోంది.

హైదరాబాద్ టాప్ ...

హైదరాబాద్ టాప్ ...

ఇండియా సగటు అద్దె ఆదాయం 3% చొప్పున ఉండగా... దేశం మొత్తం మీద హైదరాబాద్ తొలి స్థానంలో నిలుస్తోంది. మన హైదరాబాద్ లో సగటున అద్దె ఆదాయం 3.7% ఉన్నట్లు అనారోక్ వెల్లడించింది. ఈ విషయంలో 3.6% రెంటల్ ఇన్కమ్ తో బెంగుళూరు మహా నగరం రెండో స్థానంలో ఉంది. 3.3% రాబడితో పూణే మూడో స్థానంలో నిలుస్తోంది. విచిత్రంగా ప్రాపర్టీ విలువలు ఆకాశమంత రేంజ్ లో ఉండే ముంబై మహానగరం లో మాత్రం అద్దెల ఆదాయం కేవలం 3% మాత్రమే కావటం గమనార్హం. దేశ రాజధాని ఢిల్లీ లో 2.2%, గురుగ్రామ్ లో 3.5%, నోయిడా లో 3.2% చొప్పున అద్దెల రాబడి ఉంటోంది.

ఏది బెటర్...

ఏది బెటర్...

చాలా మంది రియల్ ఎస్టేట్ కొనుగోలుదారులు, ముఖ్యంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీ బయ్యర్స్ రెంటల్ ఇన్కమ్ ను పరిగణన లోకి తీసుకుంటారు. కానీ అంతకంటే ముఖ్యంగా సదరు ప్రాపర్టీ విలువ పెరుగుందనే అంశం కూడా వారిని ఇన్వెస్ట్మెంట్ వైపు నడిపిస్తుంది. అదే కమర్షియల్ ప్రాపర్టీ కొనుగోలు చేస్తే అద్దెలు అధికంగా వచ్చే మాట వాస్తవమే అయినప్పటికీ పెట్టుబడి కూడా ఎక్కువ అవసరం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే మదుపరులు ఒక నిర్ణయానికి వస్తారు. అనారోక్ పరిశోధన ప్రకారం 53% కొనుగోలుదారులు నిలకడైన రెంటల్ ఇన్కమ్ రావాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో 39% మాత్రం సదరు ప్రాపర్టీ ని విక్రయిస్తే వచ్చే లాభాల కోసం వేచిచూస్తున్నారని తేలింది. దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్ అటు ధరల విషయంలో మెరుగ్గా ఉండటమే కాకుండా, ఇటు అద్దెల రాబడి విషయంలోనూ ఇన్వెస్టర్ల ను ఆకట్టుకుంటోందన్నమాట. మరెందుకు ఆలస్యం? హైదరాబాద్ లో ఇల్లు కొనాలనే ప్రణాళిక ఉంటే కొత్త ఏడాదిలో కోనేయండి మరి!

English summary

రెంటల్ ఇన్‌కంలో హైదరాబాద్ టాప్... సింగపూర్ కంటే కూడా బెటర్! | Hyderabad leads in high rental income in India

Hyderabad leads in high rental income in India beating other metropolitan cities in the country and even the uber rich cities like Singapore. Hyderabad has the highest rental yield of 3.7% while Bengaluru at 3.6% and Pune at 3.3% respectively.
Story first published: Saturday, January 11, 2020, 8:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X