భారత దేశంలోని అత్యంత నివాసయోగ్య నగరంగా హైదరాబాద్ నిలిచింది. ఈ మేరకు హాలిడిఫై డాట్ కామ్ వెబ్‌సైట్ ఈ ఏడాది జనవరి నుండి జూన్ మధ్య దేశంలోని 34 నగరాల్లో సర్వే నిర్వహించింది. ఇందులో హైదరాబాద్ బెస్ట్ ఛాయిస్‌గా నిలిచింది. దేశంలోని నివాసయోగ్య, ఉపాధి కార్యక్రమాల నిర్వహణ అంశాల్లో తొలి స్థానంలో నిలిచింది. ఉత్తమ అవకాశాలు, మెరుగైన మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి, ఆభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ ఆధారంగా హాలిడిఫై డాట్ కామ్ ఈ సర్వే నిర్వహించి, రూపొందించింది.
సాంస్కృతిక సమ్మేళం ప్రాతిపదికన రూపుదిద్దుకున్న నగరాల్ని సర్వే కోసం ఎంచుకుంది. ఇందులో ఉత్తమ నగరాల జాబితాను రూపొందించింది. ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీ నగరాలను అధిగమించి హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ నగరం భిన్నసంస్కృతులు, కొత్తపాతల సమ్మేళనం అని ఈ సర్వే అభిప్రాయపడింది. హైదరాబాద్‌ను దక్షిణ భారతదేశ న్యూయార్క్‌గా అభివర్ణించింది.

ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందడం, అత్యాధుక విమానాశ్రయం, ప్రపంచస్థాయి స్కూల్స్ వంటివి హైదరాబాద్‌ను ఉత్తమ నగరాల్లో నిలవడానికి కారణం అయ్యాయని తెలిపింది. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య తక్కువ అని తెలిపింది. చారిత్రక, వారసత్వ సంపదతో హైదరాబాద్ గొప్ప పర్యాటక కేంద్రంగా నిలిచిందని తెలిపింది. చార్మినార్, బిర్యానీ హైదరాబాద్ ప్రత్యేకతలు అని తెలిపింది. ఇక్కడ 80కి పైగా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని తెలిపింది.
చార్మినార్‌తో పాటు గోల్కొండ కోట, రామోజీ ఫిలిం సిటీ, బిర్లా టెంపుల్, హైటెక్ సిటీ, చూడదగ్గవని తెలిపింది. ఈ సర్వేలో హైదరాబాద్ నగరం 5 పాయింట్లకు గాను 4 సాధించింది. హైదరాబాద్‌ను విజిట్ చేయడానికి బెస్ట్ టైమ్ సెప్టెంబర్ నుండి మార్చి కాలం అని తెలిపింది. గతంలో జేఎల్ఎల్ 2020 సూచీలో హైదరాబాద్ ప్రపంచంలోనే ఉత్తమ డైనమిక్ నగరంగా నిలిచింది.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications