For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీ రంగంలో నియామకాలు జంప్, మూడో స్థానంలో హైదరాబాద్

|

కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న వివిధ రంగాలు పుంజుకుంటున్నాయి. మహమ్మారి సమయంలో వివిధ రంగాలు తీవ్రంగా నష్టపోయినప్పటికీ, ఐటీ రంగంపై ప్రభావం తక్కువే. కరోనా తర్వాత ఐటీరంగంలో వేగం కనిపిస్తోంది. సెకండ్ వేవ్ అనంతరం ఐటీ రంగంలో నియామకాలు పెరుగుతున్నాయి. గత ఏడాది (2020) సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో నియామకాల్లో సగటున 13 శాతం వృద్ధి కనిపించింది. నియామకాలకు సంబంధించి నగరాల వారీగా చూస్తే బెంగళూరు మొదటి స్థానంలో, హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచాయి. పుణే రెండో స్థానంలో ఉంది.

మూడో స్థానంలో హైదరాబాద్

మూడో స్థానంలో హైదరాబాద్

ఐటీ రంగ నియామకాల్లో 32 శాతం వృద్ధితో బెంగళూరు మొదటి స్థానంలో, పూణే 11 శాతంతో రెండో స్థానంలో, హైదరాబాద్ 10 శాతంతో మూడో స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత వరుసగా చెన్నై, ముంబై 6 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేశాయి. సాఫ్టువేర్ ఇంజనీర్ల నియామకాలు 9 శాతం, డెవలపర్ నియామకాలు 7 శాతం పెరిగాయి. ఈ రంగంలో నిపుణుల కోసం అన్వేషణ అధికంగా ఉంది. దీంతో ఉద్యోగాలకు సరైన అభ్యర్థులు దొరకడమే కష్టంగా ఉందని ప్రముఖ జాబ్ పోర్టల్ ఇండీడ్ రిపోర్ట్ తెలిపింది.

నిపుణుల కొరత అధికంగా ఉన్న విభాగాల్లో సపోర్ట్ ఎస్కలేషన్ ఇంజనీర్ (69 శాతం), బిజినెస్ ఆబ్జెక్ట్స్ డెవలపర్(63.4 శాతం), మైక్రోసాఫ్ట్ సర్వర్ ఇంజనీర్ (60.8 శాతం), అప్లికేషన్ సెక్యూరిటీ ఇంజనీర్ (60 శాతం), టెక్నాలజీ సొల్యూషన్స్‌ ప్రొఫెషనల్, డీప్‌ లెర్నింగ్ ఇంజనీర్, సాఫ్ట్‌వేర్ డెవల్‌పమెంట్ ఇంటర్న్, ప్రోగ్రామ్ అనలిస్ట్, టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్, ప్రిన్సిపల్ ప్రొడక్ట్ మేనేజర్ ఉన్నాయి.

వేతనాలు ఇలా...

వేతనాలు ఇలా...

సెప్టెంబర్ 2019 నుండి సెప్టెంబర్ 2021 మధ్య కాలంలో ఐటీ జాబ్స్ 26 శాతం పెరిగాయి. సగటున సాఫ్టువేర్ ఆర్కిటెక్ట్స్ వేతనాలు ఏడాదికి రూ.13 లక్షలు, టెక్నికల్ లీడ్స్ రూ.11.50 లక్షలు, డేటా ఇంజినీర్స్ రూ.10.5 లక్షలు, సాప్ కన్సల్టెంట్ రూ.10 లక్షలు, సేల్స్ ఫోర్స్ డెవలపర్ రూ.9.7 లక్షలు ఉన్నాయి.

ఐటీతో పాటు బిజినెస్ సర్వీసెస్ అదుర్స్

ఐటీతో పాటు బిజినెస్ సర్వీసెస్ అదుర్స్

2021 జనవరి-జూన్ కాలంలో భారత ఐటీ, బిజినెస్ సర్వీసెస్ 6.4 శాతం వృద్ధిని సాధించింది. వ్యాల్యూ రూ.51,713 కోట్లకు చేరుకుంది. ఐడీసీ రిపోర్ట్ ప్రకారం 2019 తొలి అర్ధ సంవత్సరంతో పోలిస్తే గత ఏడాది ఇదే కాలంలో ఐటీ, బిజినెస్ సర్వీసెస్ మార్కెట్ 5.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంపెనీలు డిజిటల్ వైపు పెద్ద ఎత్తున ఫోకస్ చేయడమే ఈ వృద్ధికి కారణంగా చెబుతున్నారు. పరిశ్రమలో ఐటీ సేవల వాటా 78 శాతం, వృద్ధి 7.3 శాతంగా నమోదయింది. అంతముందు ఏడాది 5.7 శాతంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడంతోపాటు క్లౌడ్, సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో కంపెనీల పెట్టుబడి వ్యయం పెరిగి ఐటీ, బిజినెస్ సర్వీసెస్ మున్ముందు మరింత పెరుగుతాయని చెబుతున్నారు.

English summary

ఐటీ రంగంలో నియామకాలు జంప్, మూడో స్థానంలో హైదరాబాద్ | Hyderabad accounts for 10 percent of hiring in IT sector among other cities

Hyderabad accounted for 10 percent of hiring among cities, just behind Pune with 11 percent. Bengaluru stood on the top by hiring 32 percent of the IT workforce, whereas 6 percent of the hiring happened in Chennai and Mumbai.
Story first published: Thursday, November 11, 2021, 13:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X