For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గంటకు రూ.7 కోట్లు, ముఖేష్ అంబానీ భారీ సంపాదన వెనుక.., రాకెట్‌లా అదానీ ఆస్తులు

|

భారత్‌లో బిలియనీర్ల సంఖ్ పెరుగుతోంది. 2019లో సగటున ప్రతి నెలకు ముగ్గురు డాలర్ బిలియనీర్లు పుట్టుకు వచ్చారు. గత ఏడాది కొత్తగా 34 మంది బిలియనీర్లు జత కావడంతో ఈ సంఖ్య మొత్తం 138కి చేరుకుంది. ఈ మేరకు హూరన్ రిచ్ లిస్ట్ భారత బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. ఎక్కువ మంది బిలియనీర్ల జాబితాలో భారత్ (138 మందితో) ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ఇక, ఆసియాలోనే అత్యంత ధనికుడిగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని నిలిచారు.

రూ.2,000 కథ ముగిసినట్లే? ATMలో క్యాసెట్ తొలగింత, బ్యాంకుల ప్రకటన!రూ.2,000 కథ ముగిసినట్లే? ATMలో క్యాసెట్ తొలగింత, బ్యాంకుల ప్రకటన!

ముఖేష్ సంపద రూ.4.8 లక్షల కోట్లు

ముఖేష్ సంపద రూ.4.8 లక్షల కోట్లు

ప్రపంచ ధనవంతుల జాబితాలోని తొలి పది స్థానాల్లో ముఖేష్ అంబానీ వరుసగా రెండోసారి కూడా స్థానం దక్కించుకున్నారు. భారత్, ఆసియా కుబేరుడిగా నిలిచారు. హూరన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2020 జాబితాలో ఆయన సంపద 13 బిలియన్ డాలర్లు పెరిగి 67 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో 9వ స్థానంలో నిలిచారు. భారత కరెన్సీలో రూ.4.8 లక్షల కోట్లు.

ముఖేష్ సంపాదన గంటకు రూ.7 కోట్లు

ముఖేష్ సంపాదన గంటకు రూ.7 కోట్లు

హూరన్ జాబితా ప్రకారం ముఖేష్ అంబానీ సంపాదన గంటకు రూ.7 కోట్లుగా ఉంది. భారత్‌లోని బిలియనీర్ల సంఖ్య 138కి చేరుకోగా, విదేశాల్లోని భారతీయుల సంఖ్య కూడా కలుపుకుంటే 170కి పెరుగుతుంది. హూరన్ 1 బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తం సంపదన కలిగిన వారి జాబితాను విడుదల చేసింది.

24 శాతం పెరిగిన సంపాదన

24 శాతం పెరిగిన సంపాదన

హూరన్ తాజా జాబితా ప్రకారం ముఖేష్ అంబానీ సంపాదన 13 బిలియన్ డాలర్లు లేదా 24 శాతం పెరిగి 67 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గత అయిదేళ్లలో ముఖేష్ ప్రతి గంటకు రూ.7 కోట్ల సంపాదనను జమ చేసుకున్నారు.

ముఖేష్ సంపాదన భారీగా పెరగడం వెనుక.. జియో

ముఖేష్ సంపాదన భారీగా పెరగడం వెనుక.. జియో

ఆసియా దేశాల్లోనే ముఖేష్ సంపాదన భారీగా పెరిగింది. అతని సంపాదన ఇంత ఎక్కువగా పెరగడానికి ప్రధాన కారణం టెలికం బిజినెస్. 2016లో ఆయన రిలయన్స్ జియోను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు, 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన తొలి భారత కంపెనీ రిలయన్స్‌గా నిలిచింది. రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్, రిఫైనింగ్, పెట్రో కెమికల్స్.. ఇలా వివిధ రంగాల్లో రిలయన్స్ ఉంది.

టాప్ 100లో భారతీయులు..

టాప్ 100లో భారతీయులు..

టాప్ 100 జాబితాలో భారత్ నుంచి ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, శివనాడర్ ఉన్నారు. గౌతమ్ అదానీ, శివనాడర్ సంపాదన చెరో 17 బిలియన్ డాలర్లుగా ఉంది. వీరు 68వ స్థానం దక్కించుకున్నారు. కొటక్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఎండీ ఉదయ్ కొటక్ 15 బిలియన్ డాలర్ల కోట్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో రూ.1 లక్ష కోట్ల సంపాదనతో 91వ స్థానంలో నిలిచారు.

రాకెట్‌లా అదానీ ఆస్తులు..

రాకెట్‌లా అదానీ ఆస్తులు..

హిందూజా గ్రూప్‌కు చెందిన ఎస్పీ హిందూజా అంట్ ఫ్యామిలీ సంపాదన 27 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆర్సెలార్ మిట్టల్ లక్ష్మీ మిట్టల్ సంపాదన 15 బిలియన్ డాలర్లుగా ఉంది. రినెవబుల్ జనరేషన్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ గ్యాస్ డీమెజ్ర్ నేపథ్యంలో గౌతమ్ అదానీ ఆస్తులు ఏకంగా 7.1 బిలియన్ డాలర్ల నుండి 17 బిలియన్ డాలర్లకు రాకెట్‌లా దూసుకెళ్లాయి.

కొటక్ మహీంద్రా బ్యాంక్‌కు చెందిన ఉదయ్ కొటక్ ఆస్తులు కూడా భారీగానే పెరిగాయి.

English summary

గంటకు రూ.7 కోట్లు, ముఖేష్ అంబానీ భారీ సంపాదన వెనుక.., రాకెట్‌లా అదానీ ఆస్తులు | Hurun Global Rich List: Mukesh Ambani minted Rs 7 crore every hour in 2019

India added more than three dollar billionaires every month in 2019, taking the tally to 138 that has helped the country to feature at the third position globally, says a report.
Story first published: Thursday, February 27, 2020, 10:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X