For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HSBC సంచలన ప్రకటన.. సిలికాన్ వ్యాలీ UK అనుబంధ సంస్థ కొనుగోలు.. రేటెంతంటే..?

|

Silicon Valley Bank: అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలంటో దాని విలువ కూడా పాతాళానికి చేరిందని తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన యూకే అనుబంధ సంస్థను కొనుగోలు చేస్తున్నట్లు HSBC సంచలన ప్రకటన చేసింది.

టెక్ లెండర్ రేటు..

టెక్ లెండర్ రేటు..

స్టార్టప్ కంపెనీలతో వ్యాపారం నిర్వహించే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మార్చి 10న మునిగిపోయింది. అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్ దివాలా తీయటంతో దాని షేర్ ధర కుప్పకూలి నేలను తాకింది. ఇదే క్రమంలో దీని యూకే అనుబంధ సంస్థను ప్రముఖ బ్యాంక్ HSBC కొనుగోలు చేస్తున్నట్లు ప్రకిటంచింది. అయితే దీనిని కేవలం ఒక పౌండ్ అంటే దాదాపు రూ.100కే కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించి బాంబు లాంటి వార్తను వెల్లడించింది.

యూకేలో బ్యాంక్ పరిస్థితి..

యూకేలో బ్యాంక్ పరిస్థితి..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం సిలికాన్ వ్యాలీ బ్రిటన్ అనుబంధ సంస్థకు 5.5 బిలియన్ల రుణాలు ఉన్నాయి. దీనికి తోడు 6.7 బిలియన్ పౌండ్ల కస్టమర్ డిపాజిట్లను కలిగి ఉంది. అయితే ఈ విలువ పేరుకు చెప్పుకోవటానికేనని తెలుస్తోంది. ప్రస్తుతం సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మెుత్తం రుణం ప్రభుత్వ మద్ధతును కలిగి ఉంది.

విలువ తక్కువ అందుకే..

విలువ తక్కువ అందుకే..

రుణాలకు ప్రభుత్వ గ్యారెంటీ ఉంది కాబట్టి.. డీల్ తర్వాత HSBC ఎలాంటి లోన్‌ను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ UK అనుబంధ సంస్థ డిసెంబర్ 31, 2022తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 88 మిలియన్ యూరోల లాభాన్ని నమోదు చేసింది. ఇదే సమయంలో బ్యాంక్ 1.4 బిలియన్ డాలర్ల చరాస్తులను కలిగి ఉంది. ఇప్పటికే ఉన్న వనరులతోనే ఈ డీల్‌ పూర్తయిందని హెచ్‌ఎస్‌బీసీ తెలిపింది.

English summary

HSBC సంచలన ప్రకటన.. సిలికాన్ వ్యాలీ UK అనుబంధ సంస్థ కొనుగోలు.. రేటెంతంటే..? | HSBC bought silicon valley UK subsidary business just for 1 pound know details

HSBC bought silicon valley UK subsidary business just for 1 pound know details
Story first published: Monday, March 13, 2023, 14:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X