For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్బీఐలో చిన్నపిల్లల కోసం అకౌంట్ సౌకర్యం: ఓపెన్ కోసం సింపుల్ స్టెప్స్ ఇవే

|

ముంబై: దేశంలో లీడ్ బ్యాంక్‌గా కొనసాగుతోంది స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా. బ్యాంకుల విలీనం ప్రక్రియ తరువాత ఎస్బీఐ మరింత బలోపేతమైంది. వేల కోట్ల రూపాయల మేర డిపాజిట్లను కలిగివుంది ఎస్బీఐ. అదే స్థాయిలో ఖాతాదారులకు తన వేర్వేరు రకాల ప్రొడక్ట్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. యోనో యాప్‌ను ప్రవేశపెట్టిన తరువాత ఎస్బీఐలో బ్యాంకింగ్ అనేది మరింత సులభతరమైంది. వ్యక్తిగత రుణాలను కూడా ఈ యాప్ ద్వారా తీసుకునే వెసలుబాటు లభించింది.

రెండు సేవింగ్స్ అకౌంట్స్..

రెండు సేవింగ్స్ అకౌంట్స్..

కాగా- చిన్నపిల్లల్లో పొదుపును అలవాటు చేయడానికి ప్రవేశపెట్టిన రెండు పథకాలకు ఖాతాదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. పెహలా కదమ్, పెహలీ ఉడాన్ పేరుతో వీటిని లాంచ్ చేసింది. చిన్నపిల్లల పేరు మీద అకౌంట్లను తెరవడానికి ఉద్దేశించిన సేవింగ్స్ అకౌంట్ స్కీమ్స్ ఇవి. దీన్ని తెరవడానికి బ్యాంక్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలను నిర్వహించే వెసలుబాటును కల్పించింది ఎస్బీఐ.

ఎలా ఓపెన్ చేయొచ్చంటే..

ఎలా ఓపెన్ చేయొచ్చంటే..

పెహలా కదమ్- 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఉద్దేశించిన సేవింగ్స్ అకౌంట్. 10 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు పెహలా ఉడాన్ అందుబాటులో ఉంది. ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి. హోమ్ పేజీలో పర్సనల్ బ్యాంకింగ్‌పై క్లిక్ చేయాలి. అకౌంట్స్ ట్యాబ్‌పై క్లిక్ చేస్తే.. సేవింగ్స్ అకౌంట్ ఫర్ మైనర్స్ అనే అక్షరాలు కనిపిస్తాయి. వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం అప్లై నౌ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.

అప్రూవ్ కోసం..

అప్రూవ్ కోసం..

డిజిటల్ అండ్ ఇన్‌స్టా సేవింగ్ అకౌంట్ పాప్అప్ ఫీచర్ ప్రత్యక్షమౌతుంది. అక్కడ ఓపెన్ డిజిటల్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఖాతా తెరవడానికి అవసరమైన పూర్తి సమాచారాన్ని అందులో భర్తీ చేయాలి. అనంతరం అప్లై నౌ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీనితో ఫామ్ ఫిల్లింగ్ ప్రాసెస్ పూర్తవుతుంది. దీన్ని అప్రూవ్ చేయించుకోవడానికి సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ ఆఫీస్‌కు వెళ్లాలి. దీనికి సంబంధించిన వివరాలను అక్కడి సిబ్బందికి తెలియజేస్తే.. వారు ఆమోదిస్తారు.

రూ.10 లక్షల వరకు డిపాజిట్..

రూ.10 లక్షల వరకు డిపాజిట్..

ఈ రెండు అకౌంట్స్‌లల్లో- 10 లక్షల రూపాయల వరకు ఇందులో మనం డిపాజిట్ చేసుకోవచ్చు. చెక్ బుక్ సౌకర్యం కూడా ఉంది. బ్యాంక్ అకౌంట్‌ను తెరిచిన మైనర్ పేరు మీద ఈ చెక్ బుక్ జారీ చేస్తుంది ఎస్బీఐ. దాన్ని గార్డియన్‌కు మాత్రమే అప్పగిస్తుంది. ఫొటో ఉన్న ఏటీఎం కమ్ డెబిట్ కార్డును మంజూరు చేస్తుంది. దీని విత్‌డ్రావల్ పరిమితి 5,000 రూపాయల వరకు మాత్రమే. పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) వద్ద కూడా ఈ లిమిట్ దాటదు. ఒకరోజులో 2,000 రూపాయలు మాత్రమే విత్ డ్రా చేసుకునే వీలు ఉంది.

English summary

ఎస్బీఐలో చిన్నపిల్లల కోసం అకౌంట్ సౌకర్యం: ఓపెన్ కోసం సింపుల్ స్టెప్స్ ఇవే | How To Open Children Savings Account In SBI?, here is the all details to know

How To Open Children Savings Account In SBI?, here is the all details to know.
Story first published: Tuesday, May 31, 2022, 15:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X