For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Aadhaar Center: దగ్గర్లోని ఆధార్‌ సెంటర్ ఇట్టె తెలుసుకోవచ్చు.. ఎలాగంటే..

|

ఇప్పుడు దేనికైనా ఆధార్ తప్పనిసరి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవిలకు ఆధార్ ప్రధానం. అయితే ఆధార్ స్పెల్లింగ్ తప్పు, అడ్రస్ మార్పు, పెళ్లైన తర్వాత మహిళల ఇంటి పేరు మార్పు, పిల్లలు పెద్దైన తర్వాత ఆధార్ మార్పు చేయడం వంటి చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనం ఆధార్ సెంటర్ కు తప్పకుండా వెళ్లాల్సి వస్తుంది. అయితే ఉళ్లలో లేక టౌన్లలో ఆధార్ సెంటర్ తెలుసుకోవడం సులభమే కానీ.. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూర్ వంటి మహానగరలలో ఆధార్ సెంటర్ ఎక్కడుందో తెలుసుకోవడం కష్టం.

భువన్‌ ఆధార్‌

భువన్‌ ఆధార్‌

గూగుల్ మ్యాప్ ఉంది అందులో చూపిస్తుంది కదా అనుకోవచ్చు. కానీ అందులో కూడా అప్పుడప్పుడు పొరపాట జరుగుతుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి ఆధార్ ను జారీ చేసే సంస్థ ఉడాయ్, ఇస్రోతో చేతులు కలిపింది. ఇస్రోకు అనుబంధంగా పనిచేసే నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ తో కలిసి 'భువన్‌ ఆధార్‌ ' అనే పోర్టల్‌ను ప్రారంభించారు.

మూడు రకాల ప్రీమియం ఫీచర్లు

మూడు రకాల ప్రీమియం ఫీచర్లు

ఈ పోర్టల్ ద్వారా ఆధార్‌ కార్డుహోల్డర్లు మూడు రకాల ప్రీమియం ఫీచర్లను పొందేందుకు అవకాశం ఉంది. దగ్గర్లో ఉన్న ఆధార్‌ కేంద్రాలను తెలుసుకోవడంతో పాటు వాటి దగ్గరకు వెళ్లేందుకు మార్గం, ఏ పరిసరాల్లో ఉందో మ్యాప్‌లో చూపే ఫీచర్లను ఈ పోర్టల్‌ లో అందుబాటులో ఉన్నాయి. ఇంతకుముందు ఆధార్‌ వివరాల్ని ధ్రువీకరించడానికి ఐరిస్‌, వేలిముద్రల్ని కచ్చితంగా స్కాన్‌ చేయాల్సి ఉండేది.

ఫేస్‌ఆర్‌డీ యాప్‌

ఫేస్‌ఆర్‌డీ యాప్‌

కానీ ఉడాయ్‌ ఇటీవల ఆధార్‌ ఫేస్‌ఆర్‌డీ యాప్‌ను తీసుకొచ్చింది. ప్లేస్టోర్‌ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఇంట్లో నుంచే మీ ముఖాన్ని స్కాన్‌ చేయడం ద్వారా ఆధార్‌ వివరాల్ని ధ్రువీకరించొచ్చని తెలిపింది. ఈ యాప్ అందుబాటులోకి తేవడం ద్వారా ఆధార్‌ నమోదు కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు.

భువన్‌ ఆధార్‌ పోర్టల్ లో సెంటర్లు ఎలా వెతకాలి

భువన్‌ ఆధార్‌ పోర్టల్ లో సెంటర్లు ఎలా వెతకాలి

ముందుగా గూగుల్లో https://bhuvan.nrsc.gov.in/aadhaar/ పోర్టల్‌లోకి వెళ్లాలి. స్క్రీన్‌కు ఎడమ వైపున మీకు నాలుగు డ్రాప్‌-డౌన్‌ ఆప్షన్లు కనిపిస్తాయి. దగ్గర్లోని ఆధార్‌ నమోదు కేంద్రాన్ని తెలుసుకునేందుకు ఆప్షన్లలో 'సెంటర్స్‌ నియర్‌బై'ను ఎంపిక చేసుకోవాలి. వెంటనే మీకు దగ్గర్లోకి కేంద్రాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

English summary

Aadhaar Center: దగ్గర్లోని ఆధార్‌ సెంటర్ ఇట్టె తెలుసుకోవచ్చు.. ఎలాగంటే.. | how to know near Aadhaar center near your location

uidai and isro launch bhuvan Aadhar portal. this use for know the aadhar center near locations..
Story first published: Saturday, July 16, 2022, 13:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X