For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Fake Loan Apps: ఫేక్ రుణ యాప్ లను ఇలా గుర్తించండి..

|

లోన్ యాప్ లు ఈ మధ్య బాగా వినపడుతున్న పదం. అయితే ఈ లోన్ యాప్ లు చాలా ప్రమాదకరం.రుణ యాప్ లోన్ ఇచ్చే ముందు మనకు సంబంధించి దాదాపు అన్ని వివరాలు తీసుకుంటారు. ఫేక్ రుణ యాప్ లు ఫోన్ కాంటక్ట్ లో వివరాలు కూడా తీసుకుంటారు. వీటికి ఎలాంటి అనుమతులు ఉండవు. దీంతో రుణం తీసుకున్నవారు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ప్రాణాలు పోతున్నాయి..

ప్రాణాలు పోతున్నాయి..

ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను ఆస‌రాగా తీసుకుని క్ష‌ణాల్లో రుణాలు అందిస్తూనే ఎక్కువ వ‌డ్డీ వ‌సూలు చేస్తున్నాయి ఫేక్ రుణ యాప్ లు. రుణాలు చెల్లించ‌డంలో విఫ‌ల‌మైన వారిపై బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాయి. వారి ప్రాణాలను బలి త తీసుకుంటున్నాయి. మరి వీటిని గుర్తించడమెలాగే చూద్దాం..

600 పైగా ఫేక్ రుణ యాప్‌లు

600 పైగా ఫేక్ రుణ యాప్‌లు

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇచ్చిన నివేదిక ప్రకారం... 600 పైగా ఫేక్ రుణ యాప్‌లు వివిధ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. అందువల్ల రుణం కోసం ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు యాప్ పేరు, దాని రేటింగ్, యాప్ స్టోర్లో సమీక్షలు, ఇతర వివరాలను పరిశీలించాలి. నకిలీ యాప్‌లు నిర్వహిస్తున్న వారు తమ చిరునామాను తప్పుగా ఇస్తుంటారు. అందుకే అడ్రస్ ఒకటి రెండుసార్లు చూసుకోవాలి.

అధికారిక వెబ్‌సైట్‌ తనిఖీ చేయాలి

అధికారిక వెబ్‌సైట్‌ తనిఖీ చేయాలి

ఆర్‌బీఐ లైసెన్స్ ఉన్న NBFCతో భాగ‌స్వామ్యం ఉంద‌ని వినియోగ‌దారుల‌ను కొన్ని యాప్ లు త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయి. అందువ‌ల్ల రుణం కోసం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు యాప్‌ను నిర్వ‌హిస్తున్న రుణ సంస్థ గురించి త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిందే.. లేకుంటే ఇబ్బందులు తప్పువు. మీరు ఎంచుక‌న్న రుణ సంస్థ నిర్దిష్ట NBFCతో భాగ‌స్వామ్యం ఉంద‌ని చెబితే, ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌కి తనిఖీ చేసుకోవాలి.

English summary

Fake Loan Apps: ఫేక్ రుణ యాప్ లను ఇలా గుర్తించండి.. | how find out fake an apps in internet

Nowadays, there are many fake loan schemes. And how to recognize them..
Story first published: Saturday, July 23, 2022, 13:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X