For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Hyderabad: హైదరాబాద్ లో భారీగా పెరిగిన అద్దెలు.. జీతంలో సగం దానికే..

|

హైదరాబాద్ లో నివసించడం ఇక కష్టం కావొచ్చు.. ఎందుకంటే పట్నంలో రెంట్ భారీగా పెరిగింది. విద్యా సంస్థలు, కార్యాలయాల పునఃప్రారంభంతో అద్దెలు భారీగా పెరిగాయి. కరోనా సమయంలో కాస్త తగ్గిన రెంట్లు ప్రస్తుతం పెరుగుతూ వస్తున్నాయి. కోవిడ్ కంటే ముందు ప్రీమియం ప్రాపర్టీల రెంట్లు 5-7 శాతం వృద్ధిని నమోదు కాగా.. గత రెండేళ్లలో ఏకంగా 18 శాతం పెరిగాయని అనరాక్‌ అనే సంస్థ నివేదిక విడుదల చేసింది.

2022 నాటికి

2022 నాటికి

ప్రధాన ప్రాంతాలలో డిమాండ్‌కు తగిన లగ్జరీ గృహాల సప్లయి లేకపోవటమే అద్దె పెరుగుదలకు కారణమని విశ్లేషించింది. అత్యధికంగా ముంబైలోని వర్లీలో 18 శాతం మేర అద్దెలు పెరిగాయని పేర్కొంది. ఇక్కడ 2020లో 2 వేల చ.అ ఇంటి అద్దె రూ.2 లక్షలుగా ఉండగా.. 2022 నాటికి రూ.2.35 లక్షలకు పెరిగిందని వివరించింది.

బెంగళూరులోని జేపీ నగర్‌లో 13 శాతం వృద్ధితో రూ.46 వేల నుంచి రూ.52 వేలకు, రాజాజీనగర్‌లో 16 శాతం వృద్ధితో రూ.56 వేల నుంచి రూ.65 వేలకు అద్దెలు పెరిగాయని పేర్కొంది.

హైదరాబాద్‌

హైదరాబాద్‌

హైదరాబాద్‌ విషయానికొస్తే రెండేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌లో 2 వేల చ.అ. ఇంటి అద్దె రూ.54 వేలుగా ఉండగా.. 2022 నాటికి 15 శాతం మేర పెరిగి రూ.62 వేలకు చేరిందని అనరాక్ సర్వేలో తేలింది. అలాగే హైటెక్‌సిటీలో 2020లో రూ.53 వేలుగా ఉన్న రెంట్‌.. ప్రస్తుతం 11 శాతం వృద్ధితో రూ.59 వేలకు పెరిగిందని పేర్కొంది. అలాగే జూబ్లీహిల్స్‌లో 2020లో చ.అ. సగటు ధర రూ.6,950గా ఉండగా.. 2022 నాటికి 6 శాతం వృద్ధి రేటుతో రూ.7,400లకు పెరిగిందని వివరించింది.

కోల్‌కత్తా

కోల్‌కత్తా

కోల్‌కత్తాలోని బల్లీగంజ్‌లో 10 శాతం పెరుగుదలతో రూ.88 వేల నుంచి రూ.97 వేలకు, ఎన్‌సీఆర్‌లోని గోల్ఫ్‌కోర్స్‌ ఎక్స్‌టెన్షన్‌ రోడ్‌లో 12 శాతం వృద్ధితో రూ.50 వేల నుంచి రూ.56 వేలకు, పుణేలోని కోరాగావ్‌ పార్క్‌లో 14 శాతం వృద్ధితో రూ.59,500ల నుంచి రూ.68 వేలకు నెలవారీ అద్దెలు పెరిగాయని వివరించింది.

English summary

Hyderabad: హైదరాబాద్ లో భారీగా పెరిగిన అద్దెలు.. జీతంలో సగం దానికే.. | House Rents were Increased heavily in Hyderabad

House rents in Hyderabad have increased drastically. As a result, many people have to pay half of their salary for rent.
Story first published: Saturday, October 8, 2022, 11:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X