కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యస్థను కుదిపేస్తోంది. ప్రధానంగా పర్యాటక రంగంపై భారీ ప్రభావం పడింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 19వేల మంది ఈ మహమ్మారి కారణంగా మృత్యువాత పడటంతో ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మార్కెట్లు కుప్పకూలడం, ఎక్కడికి అక్కడ రవాణా నిలిపివేయడంతో పర్యాటక రంగం కుదేలైంది. హోటళ్ల, రెస్టారెంట్లు, పార్కులు, అమ్యూజింగ్ పార్కులు మూసివేయడంతో వేలు, లక్షల కోట్ల నష్టం వాటిల్లుతోంది.

ట్రంప్‌కు డబుల్ లాస్
కరోనాతో అగ్రదేశం అమెరికా కూడా చిగురుటాకులా వణికిపోతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ట్రంప్ అధ్యక్షుడు కాకముందు స్వయానా వ్యాపారవేత్త. ఇప్పటికే అతను అమెరికా ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు ఇబ్బందులుపడుతున్నారు. వ్యాపారవేత్త కావడంతో ఆయన బిజినెస్‌పై కూడా భారీగానే ప్రభావం పడింది. అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థతో పాటు తన వ్యాపారాన్ని కూడా ఆయన నిలబెట్టుకోవాల్సి ఉంది.

ట్రంప్ ఈ బిజినెస్‌లు అన్నీ క్లోజ్
ట్రంప్ ఆర్గనైజేషన్ హోటల్, గోల్ఫ్ కోర్స్, రియల్ ఎస్ట్టే వంటి వివిధ రంగాల్లో ఉంది. అమెరికా, కెనడా దేశాల్లో ట్రంప్‌కు 2,200 గదులతో అత్యాధునిక 5స్టార్ హోటల్స్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ పర్యాటకుల్లేక వెలవెలపోతున్నాయి. అమెరికా, స్కాట్లాండ్, ఐర్లాండ్‌లలోని ట్రంప్ గోల్ఫ్ కోర్సులు మూసివేతకు సిద్ధమయ్యాయి. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ వద్ద గల అతని అతని క్లబ్ క్లోజ్ అయింది.

ఆ లాభమంతా ఇప్పుడు బూడిదలో..
గత ఏడాది అమెరికాలోని అన్ని హోటల్స్ మాదిరి ట్రంప్ ఆర్గనైజేషన్ హోటల్స్ కూడా చాలామంది ఉద్యోగులను తొలగించింది. 2018 ఏడాదిలో 435 మిలియన్ల రెవెన్యూ సాధించింది. కరోనా దెబ్బకు ఇప్పుడు ఆ మొత్తాన్ని నష్టపోవాల్సిన పరిస్థితి. ఇటీవల కరోనా వల్ల నష్టపోయిన రంగాలను ఆదుకునేందుకు 2 ట్రిలియన్ డాలర్ల ఎకనమిక్ రెస్క్యూ ప్లాన్‌ను కాంగ్రెస్ ముందు ఉంచారు. ఇది తన బిజినెస్ కోసమా అనే అనుమానాలున్నాయి.

ట్రంప్ హోటల్స్ అన్నీ ఖాళీగా..
ట్రంప్ హోటల్ బిజినెస్ ఏ మేరక నష్టపోయిందనే లెక్కలు తెలియనప్పటికీ, న్యూయార్క్, వాషింగ్టన్, చికాగో, లాస్ వెగాస్, వాంకోవర్, హవాయి తదితర ప్రాంతాల్లోని హోటల్స్ అన్నీ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. గోల్ఫ్ కోర్సులను క్లోజ్ చేయాలని ఆదేశాలు వచ్చాయి.

ఆదుకోవాలని హోటల్ బిజినెస్
సాధారణంగా హోటల్ బిజినెస్ గురించి ఒకరు మాట్లాడుతూ.. కనీసం మూడు శాతం ఆక్యుపెన్సీ కూడా లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా హోటల్ బిజినెస్‌లో 8 మిలియన్లకు పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో హోటల్ బిజినెస్‌ను ఆదుకునేందుకు 150 బిలియన్ డాలర్ల సహకారం అవసరమని విజ్ఞప్తి చేస్తున్నారు.
More From GoodReturns

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications