For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాయల్ ఎన్ ఫీల్డ్ కు పోటీగా హోండా హైనెస్ సీబీ 350 ... మార్కెట్లో విడుదల ..రెస్పాన్స్ ఎలా ఉంటుందో

|

ద్విచక్ర వాహనాల రంగంలో అగ్రగామిగా నిలిచిన హోండా తన కొత్త మోడల్ బైక్ ను విడుదల చేసింది. మోడ్రన్ క్లాసిక్ విభాగంలో హైనెస్ సీబీ 350 పేరుతో విడుదలైన ఈ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థకు చెందిన బైక్స్ కు పోటీ ఇచ్చేలా ఉండబోతోందని నిపుణులు చెబుతున్నారు.

హోండా సిబి 350 హై‌నెస్‌ను భారతదేశంలో విడుదల చేసి కొనుగోలుదారుల నుండి మంచి స్పందనను ఆశిస్తుంది . కొత్త హైనెస్ సీబీ 350 ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మరియు జావా వంటి విభాగంలో ఇతర రెట్రో మోటార్‌సైకిళ్లతో పోటీపడుతుంది.

జపాన్ పరికరాలతో ఇండియా మేడ్ బైక్ హై నెస్ సీబీ 350

జపాన్ పరికరాలతో ఇండియా మేడ్ బైక్ హై నెస్ సీబీ 350

హోండా బిగ్ వింగ్ డీలర్ షిప్ నెట్వర్క్ తో కలిసి ఇండియాలో ఈ బైకులు విక్రయాలను చేపట్టనుంది. చాలా ప్రత్యేకంగా తయారు చేయబడిన ఈ బైక్స్ జపాన్ నుండి తెప్పించిన పరికరాలతో మన దేశంలోనే హోండా కంపెనీ తయారు చేసింది. బైక్ ధర ఎంత ఉండబోతుంది అనేది ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ప్రారంభ ధర లక్షా 90 వేల రూపాయలుగా తెలుస్తోంది. హైనెస్ సిబి 350 వాహనం ఎల్ ఎక్స్ , ఎల్ ఎక్స్ ప్రో రెండు వేరియంట్లలో లభించనుంది.

అడ్వాన్స్ డ్ ఫీచర్లతో...ఎవర్ గ్రీన్ స్టైలిష్ బైక్

అడ్వాన్స్ డ్ ఫీచర్లతో...ఎవర్ గ్రీన్ స్టైలిష్ బైక్

అడ్వాన్స్ డ్ ఫీచర్లతో, అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చే బైక్ ను తయారు చేశామని, ఇది ఎవర్ గ్రీన్ స్టైల్ ను అందించే మోడల్ వాహనం అని , ఈ వాహనాన్ని కొనుగోలు చేసే వినియోగదారులు గర్వపడతారు అని కచ్చితంగా చెప్పగలను అంటూ హోండా మోటార్ సైకిల్ స్కూటర్ భారత విభాగం సేల్స్ డైరెక్టర్ యద్వీందర్ సింగ్ గులేరియా తెలిపారు.రాబోయే పండుగల సీజన్ నుంచి వాహనాల విక్రయాలు చేపడుతున్నట్లుగా గులేరియా ప్రకటించారు. మొత్తానికి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్రేజ్ ను బట్టి, యువత టేస్ట్ ను బట్టి హోండా హైనెస్ సీబీ350 బైక్ ను మార్కెట్లోకి తీసుకు వచ్చింది.

హైనెస్ సీబీ 350 ఫీచర్లివే .. కొనుగోలుదారుల స్పందన ఎలా ఉంటుందో

హైనెస్ సీబీ 350 ఫీచర్లివే .. కొనుగోలుదారుల స్పందన ఎలా ఉంటుందో

సీబీ 350 హైనెస్ ఒక సరికొత్త 348.36 సిసి, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ మోటారును కలిగి ఉందన్నారు.హై నెస్ CB 350 బైక్ డిస్క్ బ్రేక్ లో 17 అంగుళాల అలైవీల్స్, ట్యూబ్ లెస్ టైర్ ను కలిగి ఉందని పేర్కొన్నారు. RE క్లాసిక్ 350 మాదిరిగా, ఇది లాంగ్ స్ట్రోక్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంది. రేపటినుండి హోండా బిగ్ వింగ్ షో రూమ్ లలో బైక్ చూడడానికి అందుబాటులో ఉంటుందని, వాహనాల బుకింగ్ సేవలు ఆన్లైన్లో ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. చూడాలి ఈ వాహనానికి కొనుగోలుదారుల నుండి రెస్పాన్స్ ఎలా ఉంటుందో...

English summary

రాయల్ ఎన్ ఫీల్డ్ కు పోటీగా హోండా హైనెస్ సీబీ 350 ... మార్కెట్లో విడుదల ..రెస్పాన్స్ ఎలా ఉంటుందో | Honda H'Ness CB350 released in market to compete with Royal Enfield classic 350

Honda has launched the CB350 H'Ness in India. The new 350cc roadster now competes with other retro motorcycles in the segment like the Royal Enfield Classic 350 and Jawa.
Story first published: Wednesday, September 30, 2020, 19:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X