For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

23 ఏళ్ల నోయిడా ప్లాంట్‌ను మూసేసిన హోండా, ఉద్యోగుల వీఆర్ఎస్ లేదా ట్రాన్సుఫర్

|

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్(HCIL) ఉత్తర ప్రదేశ్‌లోని తన గ్రేటర్ నోయిడా ప్లాంట్‌ను క్లోజ్ చేస్తోందని తెలుస్తోంది. జపానీస్ ఆటో దిగ్గజం హోండా మోటో కంపెనీ గ్రేటర్ నోయిడాలో 1997లో ప్లాంటును ప్రారంభించింది. ప్లాంట్‌ను క్లోజ్ చేసినప్పటికీ కంపెనీ కార్పోరేట్ కార్యాలయం, స్పేర్ పార్ట్స్ డివిజన్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ) కేంద్రం వంటి ఇతర కార్యకలాపాలను యథాతథంగా కొనసాగనున్నాయి. దీనిపై కంపెనీ స్పందించాల్సి ఉంది.

అమ్మో! 2020... 2021లో కొత్త ఉద్యోగాలు పెరుగుతాయి: కొత్త ఏడాదిపై వారి ధీమాఅమ్మో! 2020... 2021లో కొత్త ఉద్యోగాలు పెరుగుతాయి: కొత్త ఏడాదిపై వారి ధీమా

ఇక ఆ ప్లాంటుపై ఆధారం

ఇక ఆ ప్లాంటుపై ఆధారం

దేశీయ అవసరాల కోసం అవసరమైన పూర్తి ఉత్పత్తికి ఇక నుండి హీరో కార్ప్ రాజస్థాన్‌లోని తపుకారా ఫెసిలిటీపై ఆధారపడనుందని తెలుస్తోంది. ప్లాంట్‌లో ఉత్పాదక, సామర్థ్యాన్ని పెంచేందుకు హీరో కార్స్ ప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ అసోసియేట్స్‌లో స్వచ్చంధ పదవీ విరమణ (VRS) స్కీంను ప్రవేశ పెట్టింది. గ్రేటర్ నోయిడా ప్లాంటులో సిటీ, సీఆర్-వీ, సివిక్ వంటి వివిధ మోడల్స్‌ను ఉత్పత్తి చేసింది. సంవత్సరానికి లక్ష యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఉత్పత్తి సామర్థ్యం

ఉత్పత్తి సామర్థ్యం

రాజస్థాన్ తపుకుర ఫెసిలిటీ ఏడాదికి 1.8 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ప్లాంట్ ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే ఇంజిన్లను ఉత్పత్తి చేస్తుంది. HCIL నవంబర్ నెలలో దేశీయ మార్కెట్లో 9,990 యూనిట్లను విక్రయించింది. 2019 నవంబర్‌లో 6,459 యూనిట్లు కాగా, గత ఏడాదితో పోలిస్తే 55 శాతం పెరిగింది.

ఉద్యోగులు ట్రాన్సుఫర్

ఉద్యోగులు ట్రాన్సుఫర్

ప్రస్తుతం గ్రేటర్ నోయిడా ప్లాంట్‌లోని ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకోవడం లేదా రాజస్థాన్ ప్లాంటుకు ట్రాన్సుఫర్ కావడం ఉంటుంది. కరోనా మహమ్మారి వంటి క్లిష్ట పరిస్థితుల్లోను, కన్స్యూమర్ సెంటిమెంట్ బలహీనంగా ఉన్నప్పటికీ సేల్స్ ఆశాజనకంగా ఉన్నట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్, మార్కెటింగ్ అండ్ సేల్స్ రాజేష్ గోయల్ అన్నారు.

English summary

23 ఏళ్ల నోయిడా ప్లాంట్‌ను మూసేసిన హోండా, ఉద్యోగుల వీఆర్ఎస్ లేదా ట్రాన్సుఫర్ | Honda Cars India shuts 23 year old Greater Noida car unit

Honda Cars India Ltd (HCIL) has decided to pull the plug on production at its Greater Noida plant in Uttar Pradesh, sources said on Saturday.
Story first published: Saturday, December 19, 2020, 19:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X