For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాబ్ షాక్: ఏప్రిల్‌లో 62% పడిపోయిన నియామకాలు, ఐటీ సహా ఏ రంగంలో ఎంతంటే?

|

కరోనా మహమ్మారి ఉద్యోగాలపై భారీగా ప్రభావం చూపుతోంది. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఏప్రిల్ నెలలో నియామకాలు ఏకంగా 62% తగ్గాయి. ఈ మేరకు నౌకరీ డాట్ కామ్ వెబ్ సైట్‌లో నమోదైన ఉద్యోగాల సంఖ్య ఆధారంగా నియామకాలను లెక్కించి నౌకరీ జాబ్ స్పీక్ సూచీ గణాంకాలను ప్రతి నెల విడుదల చేస్తుంది. దీని ప్రకారం గత ఏడాది ఏప్రిల్ నెలలో 2,477 నియామకాలు జరిగాయి. ఈసారి 951కి పడిపోయింది.

అమ్మో! మళ్లీ ఈ పొరపాటు చేయొద్దు! కరోనా నేర్పిన కొన్ని 'మనీ' సూత్రాలుఅమ్మో! మళ్లీ ఈ పొరపాటు చేయొద్దు! కరోనా నేర్పిన కొన్ని 'మనీ' సూత్రాలు

ఈ రంగాలపై భారీ ప్రభావం

ఈ రంగాలపై భారీ ప్రభావం

హాస్పిటాలిటీ, రెస్టారెంట్స్, టూరిజం, ఎయిర్ లైన్స్ రంగాల్లో నియామకాలు పెద్ద ఎత్తున తగ్గినట్లు తెలిపింది. ఐటీ పరిశ్రమ, ఫార్మా రంగం, బయోటెక్, ఇన్సురెన్స్ రంగాల్లోని నియామకాలపై ఈ మహమ్మారి ప్రభావం చూపినట్లు తెలిపింది. ఉద్యోగ నియామకాలపై కరోనా నీళ్లు జల్లిందని, దీంతో గత నెలలో ఏకంగా 62 శాతం తగ్గినట్లు నౌకరీ డాట్ కామ్‌కు చెందిన పవన్ గోయల్ తెలిపారు.

రంగాలవారీగా క్షీణత

రంగాలవారీగా క్షీణత

రంగాలవారీగా చూస్తే హోటల్/రెస్టారెంట్/రవాణా/విమానయానంలో 91% క్షీణత నమోదయింది. వాహన/అనుబంధ రంగాల్లో 82%, రిటైల్ రంగంలో 77%, అకౌంటింగ్/ఫైనాన్స్‌లో 70% క్షీణత నమోదయింది. టిక్కెటింగ్/పర్యాటకం/విమానయాన రంగాల్లో కొత్త ఉద్యోగాలు 95 శాతం తగ్గాయి. హోటళ్లు/రెస్టారెంట్లలో 89 శాతం తగ్గాయి. మానవవనరులు/అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 78 శాతంతగ్గాయి.

ఐటీలో 51 శాతం డౌన్

ఐటీలో 51 శాతం డౌన్

కొనుగోళ్లు/సరఫరాలో నియామకాలు 70%, మార్కెటింగ్/ప్రకటనలు 69%, విక్రయాలు/బిజినెస్ డెవలప్‌మెంట్ 69%, అకౌంటింగ్/ఫైనాన్స్ విషయానికి వస్తే 68%, ఐటీ-సాఫ్టువేర్ రంగంలో 51%, బీపీవో/ఐటీఈఎస్/కేపీవోలో 54%, ఫార్మా/బయోటెక్/హెల్త్ కేర్ రంగంలో 57%, టీచింగ్/ఎడ్యుకేషన్‌లో 56% క్షీణతను నమోదు చేశాయి.

మెట్రో నగరాలు బేజారు

మెట్రో నగరాలు బేజారు

మెట్రో నగరాలలో ఉద్యోగ అవకాశాలు పెద్ద మొత్తంలో తగ్గాయి. ఢిల్లీలో 70 శాతం, చెన్నైలో 62 శాతం, కోల్‌కతాలో 60 శాతం, ముంబైలో 60 శాతం పడిపోయాయి. కొత్త నియామకాల నుండి అనుభవం కలిగిన వారి వరకు అందరి పైన ప్రభావం పడింది. ఎక్స్‌పీరియన్స్ పరంగా చూస్తే మిడిల్ మేనేజ్‌మెంట్ రోల్స్ అంటే 8-12 ఏళ్ల అనుభవం 55%, సీనియర్లకు 13-16 ఏళ్లు 53%, లీడర్‌షిప్ రోల్స్ 16 ఏళ్లకు పైన ఉంటే 50 శాతం తగ్గిపోయాయి.

English summary

జాబ్ షాక్: ఏప్రిల్‌లో 62% పడిపోయిన నియామకాలు, ఐటీ సహా ఏ రంగంలో ఎంతంటే? | Hiring activity dips 62 percent in April

The nationwide lockdown due to the spread of COVID-19 pandemic has resulted in 62 percent decline in hiring activities in April compared to the same month last year, according to a report.
Story first published: Thursday, May 7, 2020, 7:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X