For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

adani: ఐకాన్ పై కన్నేసిన హిండెన్ బర్గ్.. అదానీ, బ్లాక్ అనంతరం మరో యుద్ధానికి సిద్ధం

|

adani: అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ వల్ల అదానీ గ్రూపునకు జరిగిన నష్టం గురించి అందరికీ తెలిసిందే. అనంతరం జాక్ డోర్సేకు చెందిన బ్లాక్ సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాగా 2023లో కొత్తగా దాని కన్ను మరో సంస్థపై పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన నెక్స్ట్ టార్గెట్ గురించి సమాచారం ఇచ్చింది.

అదానీ గ్రూపు మరియు జాక్ డోర్సే యాజమాన్యంలోని బ్లాక్ అనంతరం 2023లో తమ తాజా లక్ష్యం ఐకాన్ ఎంటర్‌ ప్రైజెస్ అని పేర్కొంది. ఇందులో ప్రముఖ పెట్టుబడిదారులు కార్ల్ ఇకాన్ మెజారిటీ వాటాను కలిగి ఉన్నారు. అయితే తన పరిశోధనలో IEP యూనిట్ల వాల్యుయేషన్ అన్యాయంగా 75 శాతానికి పైగా పెరిగిందని హిండెన్ బర్గ్ ఆరోపించింది. చివరిగా నివేదించబడిన నికర ఆస్తి విలువ (NAV)తో పోలిస్తే IEP 218 శాతం ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నట్లు తెలిపింది. ఇతర పీర్స్ తో పోలిస్తే ఇది చాలా ఎక్కువని స్పష్టం చేసింది.

adani

ఫ్లోరిడాలోని సన్నీ ఐల్స్ బీచ్‌ ప్రధాన కేంద్రంగా ఐకాన్ ఎంటర్‌ ప్రైజెస్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇది అత్యంత విజయవంతమైన పెట్టుబడి సంస్థలలో ఒకటి మరియు ఐకాన్ ప్రధాన పెట్టుబడిదారు. అనేక ఉన్నత స్థాయి సంస్థలతో డీల్స్ ద్వారా ప్రసిద్ధి చెందింది. చివరి ముగింపు నాటికి ఈ ఏడాది షేర్లు కొంత స్వల్పంగా తగ్గాయి. దీని వాల్యుయేషన్ సుమారు 18 బిలియన్ డాలర్ల ఉండవచ్చని అంచనా.

బ్లాక్ మాజీ ఉద్యోగులు తాము సమీక్షించిన ఖాతాలలో 40 శాతం నుండి 75 శాతం వరకు నకిలీవి, మోసానికి పాల్పడినవి లేదా అదనపు ఖాతాలు ఒకే వ్యక్తితో ముడిపడి ఉన్నాయని హిండెన్ బర్గ్ చెప్పింది. గత వారమే ఆ రీసెర్చ్ సంస్థ ఆరోపణలు గుప్పించగా అనంతరం ఈ ప్రకటన వెలువడింది. బ్లాక్‌ లో షార్ట్ పొజిషన్ తీసుకోవడమే కాకుండా, క్యాష్ యాప్ యూజర్ నంబర్‌లను ఎక్కువగా పేర్కొన్నట్లు నివేదికలో తెలిపింది. వీటి ఆధారంగా కస్టమర్ ఆదాయ ఖర్చులను తక్కువ చేసి చూపినట్లు ఆరోపించింది.

English summary

adani: ఐకాన్ పై కన్నేసిన హిండెన్ బర్గ్.. అదానీ, బ్లాక్ అనంతరం మరో యుద్ధానికి సిద్ధం | Hindenberg targeted Icahn Enterprises while taking short positions

Hindenberg targeted Icahn Enterprises while taking short positions
Story first published: Wednesday, May 3, 2023, 7:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X