ఒక దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా బంగాళదుంపల ధరలు విపరీతంగా పెరిగాయి. ఆలుగడ్డల ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి . ప్రస్తుతం బంగాళాదుంప యొక్క నెలవారీ సగటు ధర కిలో 40 రూపాయలుగా ఉంది. అక్టోబర్ నెలలో భారత దేశ వ్యాప్తంగా బంగాళాదుంపలు నెలవారీ సగటు రిటైల్ ధర 39.30 రూపాయలకు పెరిగింది. ఇది గత పది సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా పెరిగిన అత్యధిక ధర. విపరీతంగా పెరిగిన ధరల కారణంగా సామాన్యులకు తిప్పలు తప్పటం లేదు .

విపరీతంగా పెరిగిన బంగాళాదుంపల ధరలు
ఈ నెలలో ఢిల్లీ లో బంగాళదుంప నెలవారీ సగటు రిటైల్ ధర కిలోకు 40 రూపాయలు గా ఉంది. గత ఏడాది అక్టోబర్ నెలలో కిలో 20 రూపాయలు ఉన్న బంగాళాదుంపలు, ఈ ఏడాది అక్టోబర్ నెలకు 40 రూపాయలకు పైగా చేరింది. గత ఏడాది ధరకంటే 60 శాతం ఎక్కువగా ఉంది. సాధారణంగా బంగాళదుంపల రిటైల్ ధరలు సెప్టెంబర్ నుండి నవంబర్ నెలలో ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల నుండే బంగాళదుంప ధరలు విపరీతంగా పెరుగుతూ వచ్చాయి.

తక్కువ నిల్వ .. ప్రజల డిమాండ్ .. ధరల పెరుగుదలకు కారణం
గత సంవత్సరాలతో పోలిస్తే తక్కువ నిల్వ ఉండడం, బంగాళాదుంపలకు నార్త్ లో ప్రజల నుండి ఎక్కువ డిమాండ్ ఉండడంతో ధరలు పెరిగినట్లుగా చెప్పొచ్చు. ఏప్రిల్, మే నెలల్లో లాక్ డౌన్ సమయంలో కూడా బంగాళా దుంపల ధరలు క్రమంగా పెరుగుతూనే వచ్చాయి. లాక్ డౌన్ ఎత్తి వేసిన అనంతరం కూడా ధరలు పెరిగే అవకాశం ఉందని కేంద్ర మంత్రిత్వ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే
. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం తక్కువగా బంగాళదుంపల స్టాక్ ఉండడంవల్ల విపరీతంగా ధరలు పెరుగుతున్నట్లుగా తెలుస్తుంది.

గతంతో పోలిస్తే కోల్డ్ స్టోరేజ్ లలో తక్కువ స్టాక్
వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ గణాంకాలు ప్రకారం, ఈ సంవత్సరం కోల్డ్ స్టోరేజ్‌లో బంగాళాదుంప 214.25 లక్షల టన్నులు స్టాక్ ఉన్నట్లుగా తెలుస్తుంది , 2018-19లో 238.50 లక్షల టన్నులు స్టాక్ ఉన్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తక్కువ స్టాక్ ఉన్నట్టు లెక్క చెప్తుంది . వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వాణిజ్య మంత్రి పియూష్ గోయల్, సామాన్యులకు భారంగా మారిన బంగాళాదుంపల ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న మంత్రి పీయూష్ గోయల్
గత కొన్ని రోజులుగా బంగాళాదుంప (రిటైల్) ధరలు రూ .42 వద్ద స్థిరంగా ఉన్నా ఉన్నాయని రాబోయే కొద్ది రోజుల్లో భూటాన్ నుండి 30,000 మెట్రిక్ టన్నుల బంగాళాదుంప రావడం ప్రారంభమవుతుందని గోయల్ చెప్పారు.బంగాళాదుంప ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అవి నియంత్రించబడతాయని ఆశిస్తున్నట్లు మంత్రి చెప్పారు. దిగుమతి సుంకం అంతకుముందు 30 శాతం ఉందని ఆయన అన్నారు. ఇప్పుడు, జనవరి 31, 2021 వరకు దిగుమతి కోసం 10 శాతం సుంకం వద్ద 10 లక్షల మెట్రిక్ టన్నుల బంగాళదుంపలు దిగుమతి చేయనున్నట్లుగా తెలిపారు
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications