అమరావతి: భారీ వర్షాలు, వరదల కారణంగా ఉల్లి పండించే రాష్ట్రాల్లో దిగుబడి తగ్గింది. దీంతో ఉల్లి ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వినియోగదారులకు ఉల్లి భారం లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు బజార్లలో ఉల్లిని రూ.25కే విక్రయించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.

ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించుకోవచ్చు
గురువారం మార్కెటింగ్ శాఖ అధికారులు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. రూ.25 ధరకు రోజుకు 150 మెట్రిక్ టన్నుల ఉల్లిని రైతు బజార్లకు సరఫరా చేయాలని ఆదేశించారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో నెల రోజుల పాటు ఇదే ధరకు ఇవ్వాలని సూచించారు. అవసరమైతే ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించుకోవాలన్నారు.

తక్కువ ధరకే రైతు బజార్‌లకు
ఈ సందర్భంగా మార్కెటింగ్ శాఖ ఏం చేస్తుందో అధికారులు వివరించారు. మార్కెట్లో ఉల్లి ధర నాణ్యత ప్రకారం కిలో రూ.62 నుంచి రూ.75 మధ్య ఉందని, వేలంలో కనీస ధర రూ.53 నుంచి రూ.62కు కొనుగోలు చేస్తున్నామని, రవాణా ఖర్చులు కలుపుకుంటే రూ.70 నుంచి రూ.72 ఖర్చులు అవుతున్నాయని చెప్పారు. రైతు బజార్లకు రూ.40 నుంచి రూ.45కు సరఫరా చేస్తున్నామని చెప్పారు. అయితే ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించుకోవాలని, రూ.25కు కిలో విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అక్రమంగా నిలువ చేస్తే చర్యలు
కర్నూలు మార్కెట్‌కు వచ్చే సరుకులో సగాన్ని నేరుగా వేలంలో రైతుల నుంచి కొంటున్నట్లు అధికారులు చెప్పారు. పంట నష్టం కారణంగా దేశవ్యాప్తంగా ధరలు ఇలాగే ఉన్నట్లు చెప్పారు. ఉల్లిని అక్రమంగా నిలువ చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా, ఉల్లికి భారీ ధర రావడంతో పంట బాగా పండిన రైతులు సంతోషంగా ఉన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications