For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్

|

దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ ఉత్పత్తిలో 10 కోట్ల యూనిట్లను దాటి అరుదైన ఘనత సాధించింది. హరిద్వార్‌లోని తమ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నుండి గురువారం 10 కోట్లవ యూనిట్‌గా ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ బైక్‌ను తీసుకు వస్తున్నట్లు తెలిపింది. ముందు ముందు కూడా ఇదే వృద్ధిని కొనసాగించేందుకు వచ్చే అయిదేళ్ల కాలంలో ఏటా పది కంటే ఎక్కువ ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది.

1984 జనవరి 19వ తేదీన ఏర్పాటైన ఈ కంపెనీ ఆ తర్వాత పదేళ్లకు 10 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసి మొదటి మైలురాయిని క్రాస్ చేసింది. ఆ తర్వాత 2013లో 5 కోట్ల యూనిట్ల మైలురాయిని, 2017లో 7.5 కోట్ల మైలురాయిని అధిగమించింది. తాజాగా 10 కోట్ల యూనిట్లు అందుకున్నట్లు హీరో మోటోకార్ప్ చైర్మన్, సీఈవో పవన్ ముంజాల్ తెలిపారు.

Hero MotoCorp marks roll out of 10 crore units

కేవలం 7 ఏళ్లలోనే 5 కోట్ల నుండి 10 కోట్ల యూనిట్లకు చేరుకుంది. హీరోమోటో కార్ప్ వరుసగా 20వ సంవత్సరం ప్రపంచ అతిపెద్ద టూవీలర్ మ్యానుఫ్యాక్చరర్‌గా నిలిచింది. కాగా, ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ బైక్‌ను బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ ప్రారంభించారు.

English summary

హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్ | Hero MotoCorp marks roll out of 10 crore units

Hero MotoCorp today surpassed the significant milestone of 10 crore units in cumulative production. The unit completing the 10 crore count was an Xtreme 160R, which was rolled out of the company’s manufacturing facility in Haridwar, Uttarakhand.
Story first published: Friday, January 22, 2021, 8:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X